పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విడువకుంటిని. నేను నాకు తోఁచిన కాని యితరులు చెప్పినట్టు చేసెడు స్వభావముగల వాఁడనుకాను; ముందు కార్య వేువిధమున ముగియునో యని భయపడు స్వభావము కలవాఁడనుకాను. ఈ వ్యవహార మిట్లు జరగ 3০র্টৈকে 'రాణి-గారి (జ్యూబిలి) యుత్సవమున కయికర్చుపడఁగా మిగిలియున్న కొంచెము సౌమ్లు నే జనోపయుక్త కార్యము నిమిత్తము వ్యయ పెట్టవలెనో యాలో చించి నిశ్చయించుట కయి పురజనుల సభయొకటి జరగెను. ఆ సభయందు రాజకీయ వైద్యుఁడు ధర్మ వైద్య శాలకు చికిత్సనిమిత్త మయి వచ్చెడి నిరుపేదల యాచ్ఛాదన చానమున కంు దాని నుపయోK పఱుపవలసిన దని కోరెను : విద్యాధికులను నా పకమున సాకులుగా నుండినవారును కొందఱు ඝෆඹිණි. లాట కయి చిత్రవను ప్రదర్శనశాలలో చత్వరమును (Tennis Court) వేయించుట కయి దాని నుపయోగపఱుపవలసిన దని కోరిరి. ఆప్పుడు నేను లేచి వ్యాధి బాధితులైన నిరు"పేదలకు వస్ర దానము చేయుట కయి యున్న యల్పధనమును వ్యయ పెట్టవలసిన దని యొకరు చెప్పుచుండఁగా ధనికులును విద్యాధికులు నయిన సంపన్న గృహస్థులు జనోపయుక్త మని చెప్పి తమ నిమిత్త మయి కందుకక్రీడా చత్వరమును డానితో వేయింపు మని కోరుట యనమూనకరమును స్వప్రయోజనపరత్వము నని చెప్పితిని. నా మాటలు విని నా ప్రతిపక్షులు కరతాళధ్వనులు చేసి నన్నభినందించిరి. సభనుండి మే మి" వలకు రాఁగానే ను బ్బారావు పంతులు గారు నా వద్దకు వచ్చి విూ వ్యవహారము తుదముట్టు వఱకును విూరిఁక ముందు సభలకువచ్చి వూటూడ కుండుఁ డని నన్నుగడ్డము పట్టుకొని బతిమాలుకొనిరి. మా వ్యవహారములో సాకుల విచారణ మారంభమయినది. నా ప్రతిపకమున వచ్చిన సాళులలో కొందఱు మిత్రరకణ తత్పరత్వముచేతనో ధారణా శక్తి లోపము చేతనో, నేను తమతోననని మాటలను గూడఁ గొన్నిటిని నే నన్నట్లు తమ సాక్యములోఁ జెప్పిరి. అందు చేత దండాధికారి వారి సాక్యమును విశ్వసింపక పోవుట సహితీము తటస్థించెను. "నేను బ్రాహ్ర్మణుఁడను - లక్ష్మీనరసింహము గారు బ్రాస్త్రణేతరుడు నగుటచేత మావివాదము మాలోమాకుఁగలిగిన విశేష వివాద