పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లిచ్చినను నాకు వారు చేసిన యుపకార బుణము తీఱదు; లకరూపాయ లిచ్చినను వా రితరుల విషయమయి యింత శ్రద్ధవహించి పనిచేసియుండరు. ధనికుఁడను గాని నేనాయన కిట్లు శ్రమపడి పనిచేసి నందున కొక్క చిల్లిగవ్వ యయినను (పతి ఫలముగా నియ్యలేదు; ఆయనయు మిత్రభావము ੋਝ`ਾਂ) ధనా పేక చేత పని చేయను లేదు. ఆయనయే నాకు కావలసి నప్పుడెల్లను ధన సాహాయ్యమును జేయుచుండెడి వారని యీ వఱకే చెప్పియుంటినిXదా ! ఆయన నాకు చేసిన యుపకారమును నాజ న మధ్యమున నే నెప్పుడును మఱవఁజాలను.

వ్యవహారము కొంతవఱకు నడచిన తరువాత నా ప్రతిపక్షులు సహిత మాచిక్కులో నుండి యేలాగుననైన గౌరవముతో వెలువడి యీవలఁ బడవలె నని చింతింప మొదలు పెట్టిరి. ఉభయ పకములకును సంధిచేయవలె నని ప్రముఖు లనేకులు ప్రయత్నించిరిగాని నా మూర్థపుపట్టు వలన వారి కృషి సఫల మయినది కాదు. మా శాస్రపాఠశాలా ప్రధానోపాధ్యాయు లైన మెట్కాపు దొరగా రుభయపకముల గౌరవమును నిలుపఁగోరి, మిరు కుమార్పణమును గాని విచార సూచనముసు గాని చేయవలసిన పనిలే దనియు పూర్వ మాయన నడత మంచిది కాదని యభిప్రాయపడి యిప్పుడితరులు మంచి దేయని చెప్పటచే నేనన్న మాటలు మరలించుకొనుచున్నానని చెప్పిన చాలు ననియు దాని Tవ్వరికి తోఁచిన వ్యాఖ్యానమును వారు చేసికొందురు గాన నింతమాత్రమున rడఁబడ వలసిన దనియు బహు విధములనాతోఁ జెప్పిరికాని యిప్పుడు సహిత మతఁడు మంచివాఁడు కాఁడనియే నేను దృఢముగా నవుచున్నందున సేనట్లు సందిగ్ధ వచనములు వ్రాయుటకు సహిత మొడఁబడ నేర’ నని యాయనrరికను నిరాక రించితిని. నుబ్బారావు పంతులు గారు నన్ను సమాధానపడకుండఁ జే సిరని S”očŚ అభిప్రాయపడిరికాని oorw రనుకొన్నది సరికాదు, ముందు పర్యవసాన మెట్లు తేలినను ప్రస్తుత విూ యాయాసమును ధనవ్యయమును మనస్తాపమును తప్పించుకొని నిశ్చింతముగా నుండుట కయినను వారు కోరిన దాని కొప్పుకొని సంధిచేసికోవలసినదని పంతులుగా రెంతదూర వెూ చెప్పిరి గాని 飞飞寸 పట్టును