పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దుర్గాప్రసాదరాయఁడు గారు నన్నేలాగున నైన శిక్షింపఁజేయవలె నని యెంతో పట్టుదలతో పనిచేయఁదొడఁగిరి; నా పకమున న్యాయవాది యైన న్యాపతి ను బ్బారావు పంతులు గారును మిత్రపక వువలంబించి నన్నేలాగున నైన శిక నుండి తప్పింపఁజేయవలె నని వాదియొక్క న్యాయవాది కంటెను, పదిరెప్లెక్కువ పట్టుదలతో పని చేయసాగిరి. మిత్రవిషయ మయి పంతులు గారు పడిన శ్రమ యింతయని చెప్పుటకు శక్యము కాదు. ఈ పనిలో నాయన నిద్రాహారములను గణన చేయలేదు; తమ నిద్రను మానుకొని రాత్రియెంతో ప్రొద్దుపోయిన దాఁక మేలుకొని యీ విషయమైన గ్రంథమును చదువుట మొదలయిన పనిని చేయుచు వచ్చిరి; పగలు వేళకు భోజనమునకు సహితము పోవక యీ వ్యవహార విషయమయిన సాక్యమును చూచుట మొదలయిన పనిలో నెంతోసేపు కాలము గడపుచుండిరి. ఆయనకు భోజనము చేయునపు డును వెలుపలికి పోయినప్పుడును కూడ నీ విషయమైన చింతయే కాని కొంత కాలము వేఱు చింత లేకుండెను. ఆ సమయము నందు నా విషయమయి యూయనకుండిన మనో వ్యాకులతలో షోడశాంశమైనను నాకు • లే కసం డెను. సే నన్నమాటలు నిజము లన్న నవకముచేత వ్యవహార మెట్లు ముగిసినను సంతోషమే. యని నేను నిర్విచారముగా నుండెడినాఁడను, వ్యవహార మడుసులో పాతిన కంబమువంటి దగుటచేత సే వంక కొరుగు నో యన్నయాలోచనచేత కొన్ని సమయములయం దాయనకు రాత్రులు నిద్రసహితము తిన్నగాపట్ట కుండెను. ఈ విషయమయిన గ్రంథమును చదువుటకు రాత్రు లప్పుడప్పుడు నన్నాయన తవు యింటికి రవును చుండెడివారు, నేను సుఖముగా భోజనము చేసి పోయి యాయన కష్టపడి గ్రంథమును చదువుచుండఁగా నేను పరుండి హాయిగా నిద్రపోవుచుండెడివాఁడను. ఇన్ని వ్యవహారములు ధర్ఘస్థానములలో పెని నిలిచియుండఁగా నిట్లు నిద్ర యెట్లు పట్టునని యాశ్చర్యపడి నన్నా యన లేపి వూ యింటికి పంపుచుండెడివారు. మిత్రకార్య తత్పరత్వముచేత నా విషయమయి యాయన పడిన శ్రమకు కృతజ్ఞ తా పూర్వకము లైన నందన ములు సమర్పించుట తప్ప వేఱు ప్రతిక్రియ నేను చేయఁజాలను; లకరూపాయ