పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లక్షీనరసింహము గారు కొంత నిర్భయతపూని యీ యల్లరియంతయు నేను చేయుచున్నాను గాని తన మిఁద నెవ్వరును సందేహపడు చుండలేదని చెప్పెను. ఆ పంు నెవ్వరికితో cచిన యూటలు వా రనఁ దొడఁగిరి. అందఱు చెప్పిన మాటలను విన్నపివుట మిత్రుఁడైన వేంకట జోగయ్యగారు సహిత మింతమంది మికు వ్యతిరేకముగా చెప్పచున్నప్పుడు మిరు మి నడతను శుద్ధపఱుచు కోవలసినదని లక్ష్మీనరసింహముగారితో చెప్పవలసిన వారయిరి. ఈ దినము మొదలుకొని రామబ్రవ్యము గారి యింటివిూcద రాళ్లు పడుట నిలిచిపోయి నా కృషివలన వారి యాపద నివారణ మయినందుకు "నేను సంతో* పి oచితీని,

ఈ వ్యవహారము నడచిన తరువాత దాదాపుగా సంవత్సరకాలము నకు మిత్రులతో నాలోచించి యాలోచించి లక్ష్మీనరసింహముగారు నేను తన్నిండ్లమిఁద రాళ్లు వేయించినట్టును తన నడతమంచిది కానట్టును పెద్దమను ప్యల యెదుట దూషించినందున కయి మూడు వేల రూపాయలు మాననష్ట్ర మిప్పింపఁగోరి 1890 న సం|| జలాలంు నెల 15 వ తేదిని వుండల న్యాయ సభలో నా మినాఁద వ్యాజ్యము తెచ్చెను. నేను దీని కెంతమాత్రమును జడి యక యీ వ్యవహార విషయమై నాతో మాటాడిన వారితో నతఁడు రాళ్లు వేయించినట్టును ఆతని నడతమంచిదికానట్టును నేను ఋజు వుచేసెదనని స్పష్ట్ర ము"గాఁ జెప్పితిని. అందు మినాఁద నాతని మిత్రులును న్యాయవాది యైన దుర్గాప్రసాదరాయఁడు గారును ఆలోచించి, దండవిధి (Criminal) వ్యవహాగ ములో నతనినడతయు వాడుకయు విచారణీయములు కాకపోవుటచే నట్టి యభియోగమును దెచ్చి యది తమ కనుకూలముగా తీర్పఁబడిన యెడల నీవ్యా జ్యమును తీసివేసికోవలెనన్న యుద్దేశముతో 1890 వ సంవత్సరము జూలైసెల 29 వ తేదిని పయిని జెప్పఁబడిన దూషణము కొee కే "నామినాఁద సంయుక్త దండ విధాయకునియొద్ద నభియోగము తెచ్చిరి. ఈ విషయమయి మండల న్యాయాధిపతి తన తీర్పులో నిట్లు వ్రాసెను.