పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

*ം.9 స్వీయ చరిత్ర ము నైనను పనిచేసి పేరు పొందుచేున్నప్ప డీర్ష్యాళువులయినవారు కొందఱుబైలు చేతి యోర్వలేమి చేత వారిపైని లేనిదోషముల నారోపించేుచు వారి పేరునకు భంగము కలిగింపఁ బాటుపడుదురు, మతి కొందఱు వారికీర్తికి మాలిన్యముకలి గించి వారి నడఁగఁద్రోక్కు టచేతనే తాము పైకి రావలెనని ప్రయత్నముచేయు దురు. క్రయిరు తెగ లవారివలనియుపద్రవము సంఘసంస్కారదీక వహించి “నాయు కులయి పనిచేయువారికెట్లో యశ్లే రాజ్యాంగసంస్కారప్రయత్న ప్రతిజ్ఞ ను పూని నాయకులయి పనిచేయువారికిని గలదు. రాజ్యాంగ విషయములలోఁ బని చేయు నాయకులనుగూర్చి వారీమూలమున పరిపాలకుల యనుగ్రహమును సo పాదించి యున్నతపదములను బిరుదములను బొందెవలెనన్న యాపేక్షతో వేషము వేసిన స్వార్థపరులనియో, మూఢజనులను బురి కొల్పి దొరతనము వారివిూద వారికి చ్వేషము పట్టించి ప్రజలలో గొప్పవాడని మెప్పొందఁగోరు రాజద్రోహులనియో, యి-యసరాయాశీలురు సమయమునకుఁ దగినట్టు నిష్కారణముగా దేశ సేవాపరులమిద మిధ్యాదోషారోపణములు చేయుదురు. ఈ జేశ సేవాపరులు దేశమునకుఁ జేసిన యుపకారమునకై చెన్నపట్టణము Tవేుద లైన దూరస్థలములయందు సహితము సభలు చేసి మహాజనులు తమకృతజ్ఞతను బ్రకటించుచు నభినందనపత్రికలను జదువుచుండఁగా స్వస్థలములోని య సూ జనపరులు తారొక్కరే యుచితానుచితవివేకముగల బుద్ధిమంతులయినట్టుగా సభలు చేసినవారిని సభలలోఁ బ్రసంగించిన వారిని యుక్తాయుక్తవివేక శూన్యు లైన బుద్ధిహీనులని పత్రికలలోఁ దెగడుచుందురు. ఈదోపైక దృక్కులు జన లకుఁ జేసెడిది యుపకారలేశమయినను గానఁబడదు. లౌక్యాధికార ధూర్వహు u"సేకులు తిమకన్నులయెదుట లంచములు పుచ్చుకొని ధనికులగు చుండఁగా వారియ కార్యమునుగూర్చి యొక్క మాటయైనను పలుకుట కీవిభేఖ కపలగ్ర నోరు రాదు ; వ్రాయుటకుఁ గలము సాగదు. రేయుంబగళ్లు కష్టపడి న్యాయముగా ునిచేయు వారిని దూషించుటకు మాత్రమేవీరికి పెద్దనోరవచ్చును. సాంఘిక విషయమునఁగాని మఱియేయి తరవిషయమునఁగాని యొక్కదురాచార మును మాన్పుటకయి ప్రయత్నించుటకైనను వీరి కెప్పడును బుద్ధిపట్టదు.