పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా లు గ వ ప) క ర ణ ము ご F「)以_ యల నార్జించి యంతయు పరార్థముగానే యుపయోగించి నా భార్యమరణా నంలేరమున 1911_వ సంవత్సరమునుండి పరీక్షకత్వము నాకక్కఱలేదని మాని వేసినందున నాకిప్పడా యూయ ముసలేపోయినది. నాభౌర్య జీవించియుండిన ప్పడే నేను రాత్రులు మేలుకొని దగ్గుతో బాధపడుచు పరీక్షాప త్రములను దిద్దుచు కష్టపడుచుండుటచూచి యూమె యా పనిని వూనుకోవలసినదని బహు సంవత్సరములు నన్ను నిర్బంధ పెప్టెను. ఇదిగో పయి సంవత్సరమునుండి మాని వేసెదనని జరపుచువచ్చితిని గాని యూమె జీవితకాలములో మాని వేసినవాఁ డను గాను. నేనట్లు శ్రమపడి ధనమార్జించుచువచ్చుట వితంతు శరణాలయా దుల పోషణార్థమేళాని స్వోదరపోషణార్థముగాదు, నాభౌర్యపోయిన విరక్తి చేతను శరీరాశ క్తతచేతను పరీక్షక పదవిని విడిచిపెట్టితిని. ఆంతేకాక నేను, ప్రతి సంవత్సరమును మృత్యువును ప్రతీక్షించుచున్నాఁడను, ప్రతి సంవత్సర మును మృత్యుదేవత నాకత్యంత సౌమినాప్యమునకు వచ్చుచుండియు నెందు చేతనోకాని నన్ను విడిచి మరల వెనుకకు నడుచుచున్నది. ఈశ్వరాజ్ఞ రోమొప్ప డసs* తెలియకున్నది. ఈ దుర్బల సేవకునిచేత నీశ్వరుఁడింక ను నేమైనఁ జేయింపఁదలఁచుకొన్నాడేమో ! నాయిచ్ఛగాక సర్వవిషయపులయందును 怒)寄|్వరేచ్ఛయే నెఱవేఱునుగాక ! ఒకటి రెండు పుస్తకములు వ్రాయుటలో తప్ప నేను తలపెట్టిన కార్యములన్నియు నీశ్వరానుగ్రహమువలన నెఱవేఱి నవి. ఇఁకనే నీ లోకములాగో నుండవలసిన ప్రయోజనమంతగా నాబుద్ధికి పాడ కట్టదు. పైని చెప్పినట్లు నా ధనాగమము మట్టుపడినందున వితంతు శరణాలయ వ్యయాదులకు తెచ్చుటయే నాకతిభారముగానున్నది. ఆందుచేతనే యస్మ శీయులకును పురవాసులకును నే నీక్రిందివిజ్ఞాపనమును జేసికొనియున్నాను. దీనీగతియెట్లయినను నాముక్కున నూపిణియుండఁగా నే నీవింతతుశరణాల యూదులను విడిచి పోగొట్టఁజాలను. నావయ8-కాలమునంతను దేశాభివృద్ధి ప్రయత్నములోఁగడపి యసహాయఁడనయి యశక్తుఁడనయి బీదపడియున్న నా సాయమునకువచ్చి యస్మర్దేశీయుల వితంతుశరణాలయాదిక సంరక్షణభార మును వహింతురని నమ్మచున్నాను. స్వోదరభరణార్థమయి నే నితరసలను