పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

32 e_ స్వీయ చ రి త్ర ము పాఠశాలకుఁబోయి యుండినప్పడు సహితము లోపలఁ జేర్చుకొని యాదరించి నే నింటికి వచ్చి బట్టలు తీయుచుండఁగానే నవ్వు మొగముతో దాపునకు వచ్చి మినాకొకళుభవార్త నొప్పెదనని చెప్పి లోపలికిఁ గొనిపోయి నా కాచిన్నదానిని జూపుచుండెను. వివాహముల నిమి త్తమయి వూయింటికి వచ్చిన వితంతు కాం తలనందఱిని పత్రికా పేమతో జూచి యాదరించుచు, వారికి విద్యాదానము చేసియు మంచిబుద్ధులు చెప్పియు వుంచివారినిగాఁ జేయుటకయి పాటుపడుచు; వివాహానంతరమున వారితో ను త్తర ప్రత్యుత్తరములను జరపి వారి యోగ క్షే మములను విచారించుచు, ఆవశ్యకమైనచో ਾ8ਤੇ పురుళ్లు పోసియు వ్యాధి సమ యమునం దుపచారములు చేసియు స్వస్థపతిచి వారి నిండ్లకుఁబంపుచు, సర్వ విధములచేతను వారియెడల నత్యంతసానుభూతిని గనఁబఱుచు చుండెను. పరిణయాభిలాషతో పర తెంచెడు వితంతుయువతుల యెడల నెట్టి యా దరమును దయను జూపుచువచ్చెనో యట్టి యాదరమును జాలినే యింద్రియ దౌర్బల్యముచేతను వంచకు లైనపురుషుల మోసముచేతను మానమునుగోలుపోయి పతిత లయి పశ్చాత్త ప్తలైన యనాధమానినులయెడలను నా భార్య చూపుచు వచ్చెను ; అట్టివారినిమి త్తమయి *పతితయువతీరకణశాల' యనెడు పతిత విధవాశ్రమము నొకదానిని వూయింటి యొదుటింటిలాr*నే స్థాపించి తానే తద్వి చారణమును పైవివేసికొని వారిని పూర్వ దుర్వృత్తినుండి మరలించి బాగు చేయఁ బ్రయత్నించు చుండెను. నా భార్య జీవితకాలములో నట్టివా రేవురు రక్షింపఁబడిరి. వారిలYశీ ముగ్గరకు వివాహములు చేయఁబడెను. తక్కిన వా రిరువును బిడ్డలను గని శిశుహత్యాదోషమువలన విముక్తరాం డ్రయి స్వగృహ ములకుఁ జేరిరి. కడపట గర్భవతి యయి వచ్చిన యొక బ్రాష్ట్రణవితంతువును ప్రసవము నిమిత్తము నాభౌర్య యిచ్చటి క్రైస్తవ ప్రసవవై ద్యశాలకుఁబంపేను. ఆవితంతువు తానుగన్న యాడుబిడ్డను వైద్యశాలాధికారుల కిచ్చి లేచిపోవఁ బ్రయత్నించుచున్నదన్న వర్తమానము నా భార్యచెవి তে টৰ্ভে cণ্য-ত ৰঙ্গ ১৯৩ 23০3 చేసికొని వైద్యశాలకుఁబోయి వెంటనే తల్లిబిడ్డలను తన వెంట వూయింటికిఁ గొనివచ్చెను. తరువాత మాత శిశువును మాయింట దిగవిడిచి నిర్దయురాలయి