పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

○ 33 555 c 8% 53 § & ca ס-ס535 いシ గడియారము మొదలయిన బహుమానములాతనికే యియ్యఁబడినవి. హను మంతరావు గారు వితంతు శరణాయములాశని తమ యుపాధ్యాయపదమును విడిచి బృందావనపురమునకరిగి యక్కడ పనిచేయనారంభించిరి. ఈలోపల నేను శ్రీమతి సుందరమ్లకు విద్యాభివృద్ధిచేయుచు, 1909-వ సంవత్సరము వేసవి కాలములో నేను బెంగుళూరు వెళ్లినప్పడు నావెంటఁగొనిపోయి ప్రతిదిన మును నేనింగ్లీషు స్వయముగా చెప్పచుంటిని. ఈలోపల హనుమంతరావు గారు తన పూర్వపు పట్టుదలనువిడిచి, నాకోరిక ప్రకారముగా రాజ్యాంగో ద్యమపరిశ్రమమును విడిచి సాంఘిక ధార్మికోద్యమములయందే పనిచేయుచు నుండుట కొప్పకొని, మరల రాజమహేంద్రవరమునకు వచ్చిరి. ఈయిరువురకు 1909వ సంవత్సరము జూలై నెల 25-వ తేదిని వివాహము జరగినది. వివా హానంతరమున శ్రీమతి సుందరమ్ల వితంతు శరణాలయ పర్యవేక్షకురాలుగాను శ్రీయుత హనుమంతరావుగారు హితకారిణీ సమాజసహాయ కార్య దర్శిగాను నియమింపఁబడి యుభయులునుగలిసి యిరువదియైదు రూపాయల వేతనమును బడయుచు పనిచేయుచుండిరి. ఈ రెండు వివాహములును"గాక వసూఁడవ శాస నాను సారముగా మతి యైదు వినాహములయినవి. 1907-వ సంవత్సరమునం దొక నాటిరాత్రి మూర్ఛవచ్చి పడిపోయి శ్రేణిన తరువాత కొంతకాలము నేను దుర్బలుఁడనయి రోగపీడితుఁడనయియే, యుంటిని. ఆసమయమునందిక్కడకు పండిత శివనాథశాస్త్రీగారువచ్చిరి. కల కత్తా చూడవలెననియున్నదని నే నాయనతో చెప్పితిని. నాదేహస్థితినిజూచి యిప్పడు ప్రయాణము చేయుట యుక్తము కాదని యాయన నాతోఁజెప్పిరి. తలఁచుకొన్నపనిచేయుట నాస్వభావము. ఆందుచేత నేను నాభార్యను వెం öocጽ°K) శిననాధశాస్త్రీగారిలోఁగలిసి ఏప్రిల్ 4 తేదిని కలకత్తాకు బైలుదేతి, త్రోవలో భువనేశ్వరనువద్ద నిలిచి యచ్చటి దేవాలయములను వాని సమిప ముననున్న of "ద్ధగుహామండపములను జూచి, కలకత్తా చేరి యక్కడనున్న దిన వులలాగ శివనాధశాస్త్రిగారీ యతిథినిగానుండితిని. నా పేరావee కే కలకత్తాలో విశేషము"గాఁ దలిసియుండుటచేత సాధారణబ్రహ్మ సమాజము వారుమాత్రమే