పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డయినను ప్రార్థన సమాజ మును పేరితోఁగాని బ్రహ్మసమాజ మును పేరితోఁ గాని (యనతా రాదుల యర్చనయు విగ్రహారాధనమును లేని) యే కేశ్వర మానసి కోపాసనముగల పరిశుద్దా స్టిక సమాజ మేర్పడిన పక్షమున, ఆభాగము మరల దానిక్రింద నుపయోగ పడుచుండవలెను.

4. సమ స్త్రవిషయములలోను జ్ఞానాభ్బిద్ధి కలుగుటకును నీతి ముతకులా చారములయందలి మూఢవిశ్వాసములు తొలఁగుటకును నీతి పెంపొందుటకును దుర్నీతి దురాచారములు తొలఁగుటకును నీతిమతశాస్త్ర రాజ్యాంగ విషయములలో గుణదోషవిచారము చేయుటకును అనుకూలము లైన యుప న్యాసములు ప్రసంగములు వాదములు మొదలైనవానికొఱకును, మహనీయులను సత్కరించుట కొఱకును, దేశాభివృద్ధికిని భాషాభివృద్ధికిని తోడ్పడు కృషికొఱకును, జనులసంతోషమునకును వినోదమునకును జరగెడి యాటపాటల కొఱకును, జనోపయుక్తములైన సమస్తేతర కార్యముల కొఱకును, హిందువు యూరపియనుక్రైస్తవుఁడు మహమ్మదీయుఁడు బ్రాహ్మణుఁడు శూద్రుఁడు అను నిట్టి భేదభానము లేక యెల్లజాతులవారును సర్వమతములవారును సభలు మొదలైనవి చేసికొనుట కీ మందిర ముపయోగపడవలెను.

5. దుర్నీతిని పోత్సాహపఱచునట్టికాని జాతినుత ద్వేషములను పురికొల్పునట్టికాని రాజభక్తిని పోగొట్టునట్టికాని ప్రతిపక్షులను వారి గౌరవాస్పదులను దూషించుట కేర్పడినట్టికాని సంఘసంస్కారాదుల నిమిత్తము పాటు పడువారిని బహిష్కరించుటకొఱ కుద్దేశింపఁబడునట్టికాని సభ లిందు జరగగూడదు.

6. అవతారాదులతో సంబంధించిన యుత్సవములు, భజనలు, విగ్ర హపూజలు, వేశ్యల యాటపాటలు జారిణులు వేషములు వేయు నాటకాదులు, సురాపానాదులుగల విందులు, ఇందు జరపఁగూడదు,

7. ఈహాలునందు సత్కార్యములను జేసినవారియొక్కయు సద్వర్త సముగలవారియొక్కయు పటముల నుంచవచ్చును. మతముతో సంబంధించినట్టి