పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

of TJ” స్వీయ చ రి త్ర ము పరిత్యాగ మంగీకరించుటయేకాక మనలను బెదరింపఁజూచిన ప్రథమోపా ధ్యాయుని పరిత్యాగ పత్రమునుగూడ నంగీకరింతమని పలికెను. తత్త్వమును గెలిపి దానిని "ఛేను "వారించి త్రిని. పరిత్యక్తోద్యోగియైన కార్యదర్శి యీపాఠ శాలవిద్యావిచారణాధికారిచేత నంగీకరింపఁబడినపక్షమున తాను చెవికోయించు. కొనెదనని శపథముపలికినట్టు నాకొద్ర పెద్దమనుష్యుఁడు చెప్పెను. అయినను విద్యావిచారణాధికారి మఱుసటి సంవత్సరము నాలవ ఫారమును తరువాతి సం వత్సర మయి దాఱు ఫారములను నంగీకరించి వూపాఠశాలను సంపూర్డోన్నత పాఠశాలను జేసెను. ఇఁక పాఠశాలా భవనమునుగూర్చి కొంత వ్రాయవలసియున్నది. మంచి పని కెప్పడును మంచివారిని బ్రేరేపించి దేవుఁడు సాయముచేయుచుండును. ఈశ్వర పేరణమువలన పిఠాపురసంస్థానాధిపతులైన శ్రీరాజాకుమార మహీ పతి సూర్యారావు బహద్దరు గారు పాఠశాలాభవన నిర్మాణార్థముగా Tవెుదట. నిరువదివేల రూపాయల నిచ్చెదమని దయాపూర్వకముగా వాగ్దానముచేసిరి. ఏ హేతువుచేతనో ఫ్రాని శ్రీరాజావారికి నామినాఁద నిర్ణేతుక జాయమానాను గ హముకలిగినది. ఈ యనుగ్రహముచేతనే నేను మొట్ట మొదట తోఁటనుగొని, యందు వసింప నారంభించిన కాలములో వారు రాజమహేంద్రవరము వచ్చి నప్పడు మాతోఁటకు దయచేసి నాకు దర్శనమిచ్చిరి. వీరి సాహాయ్యముచేత నేను క్రొత్తగా కొన్న స్థలములోఁబాఠశాలాభవనమును గట్టుటకుద్యమించితిని. కట్టఁదలఁచిన భవనముయొక్క చిత్రపటమును వ్రాయించి పాఠశాలాపరీక్షకు లైన యేట్సుదొరగారికి చూపి వారా మోదించిన విూఁదట నంగీకారార్థముగా విద్యావిచారణాధికారిగారికిఁ బంపితిని. మూఁడు నెలలు దాఁటినది; వారుదాని నంగీకరించినట్టే కనఁబడినది అయినను * శ్రేయాంసి బహువిఫ్నూని ” coన్నట్లు దానికిఁ గొత్త విఘ్నములు రాఁ దొడఁగెను. ఆకాలమునందు “ వండే మాతరము" కోలాహలము దేశమునందంతటను వ్యాపించెను. ఈనూతన దేశాభి మాన ప్రకటన మితరస్థలములకంటె మారాజమహేంద్రవరమునందు తక్కువ గొcజూపఁబడలేదు, అవివేకుల పేరణముచేత నేమియు నెఱుఁగని బడిపిల్లల