పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

அ 3 அ స్వీయ చరిత్ర ము బడుచున్నవనియు, విూ రెఱిఁగియున్నారుగదా ? సమస్త విషయములయందును అభివృద్ధి పొందుచుండుట మనుష్యునకు సహజధర్ధమయియున్నది. మృగాదుల కును మనుష్యులకునుగల భేదములలో నీయభివృద్ధి విషయమైన ధర్జ మొకటి, మృగాదులభివృద్ధి లేక యెప్పడు నేకరీతి"గానుండును ; ఈవిషయమున వానికి వృద్ధికయము లుండవు ; వేయి సంవత్సరములక్రిందట కాకస లెట్లు గూండ్లు కట్టుచుండునో యిప్పడు న డేప్రకారముగా కట్టుచుండును ; ఇఁక ముందు వేయి సంవత్సరములు దాటినతరువాతను గూటిని ని ర్షించుటయం దేమియు నభివృద్ధి ని బొందక యథాప్రకారముగానే యెల్లకాలమునుగూండ్లను ని రించు కొనుచుండును. మనుష్యుఁడట్టుగాక కృషిచేయుచు వచ్చినయెడల నంతకంత కభివృద్ధి నొందుచుండును. వేయి సంవత్సరముల క్రిందట మృగప్రాయులై గుహలయందు వాసముచేయుచుండిన వారిప్పడు పెంకుటిండ్లు కట్టుకొని యందునివసించుచుండవచ్చును ; ఇఁక ముందు నాగరికాగ్రగణ్యులయి దివ్య భవనములు నిర్షించుకొని యింద్ర భోగము ననుభవింపవచ్చును. ఈ విధము గా నభివృద్ధి పొందుటకయి కృషియా పశ్యకము. జ్ఞానహీనులయి కృషిచేయక యు పేకించుచు వచ్చిన పకమున మునుపున్న స్థితియందైననుండక క్రమ క్రమముగా హీనదశను బొందుచువచ్చి కట్టకడపట నించుమించుగా మరల మృ గప్రాయులగుట సంభవించును. జ్ఞానాభివృద్ధిని జేసికొనుచు నెడతెగక కృషి చేయుచు వచ్చిన పకమున, మతమునందును నీతియందును విద్యలయందును. కులాచారములయందును వస్తునిర్ధాణాదులయందును సుఖసాధన కల్పనమునం దును తక్కిన సమస్తవిషయములయందును మన మంత కంత కభివృద్ధి నో`ందు చుందుము. ఇంచుమించు"గా నన్ని విషయములయందును సమానముగా వృద్ధి నొందుచుండుటయే యభివృద్ధియగునుగాని తక్కిన విషయములయం "దధము దశలోనుండి యొక్క విషయమునందుమాత్రము వృద్ధి చెందుట నిజమైన యభి వృద్ధికాదు. ఆట్టి యేక దేశాభివృద్ధివలన దేశ క్షేమకరములయిన ప్రయోజన ములును కలుగవలసినంత కలుగనేరవు. మనశరీరమునందలి సమస్తావయవము లును వాని వాని పరివూణమునకుఁ దగినట్టుగా నెదుగుచుండుటయే 'iవు ర