పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



మూడవ ప్రకరణము

విశ్రాంతిదశ

క్రీస్తుశకము 1900వ సంవత్సరము మొదలుకొని 1910-వ సంవత్సరము వఱకు

ఈ కాలమును నేను విశ్రాంతిదశయని పిలుచుచున్నను నాకు నిజమైన విశ్రాంతియెప్పడును కలుగలేదు. దొరతనము వారి కొలువుమానుకొని తన్ని మిత్తమునఁజేసెడు పనిని లేకుండఁజేసికొనుట యొక్కటియే విశ్రాంతియన వచ్చును. ఎప్పడును నేనేదోపని చేయుచుండవలసిన వాఁడనేకాని భోగము ననుభవించుచు నూరక సుఖముగాకూగుచుందుట నాస్వభావము కాదు. తన యపారకరుణచేత పరమేశ్వరుఁడు నన్నెల్లప్పడును కష్టజీవినిగానుంచున తోఁచుచున్నది.

1881-వ సంవత్సరమునందు గోగులపాటి శ్రీరాములుగారు ప్రథమ వితంతు వివాహమును జేసికొన్నప్పడు తనకు ప్రథమభార్యవలనఁ గలిగిన నాలుగు మాసములపురుషశిశువును పెంచుటకయి మావద్ద విడిచి నట్టివఅకే చెప్పియున్నాను. నాయందలి గౌరవముచేత శ్రీరాములుగారా శిశువునకా వఱకే నాపేరును పెట్టిరి. ఆశిశువును నేనును నా భార్యయ పుతపేమతో で3O3) పెద్దవానినిజేసితిమి. ఆతనికి మేమే విద్యాబుద్ధులు చెప్పించుటచేతి ඝෂිcඨ పట్టపరీకయందుఁ గృతార్థుడయ్యెను. & ఆపుత్రస్యగ ర్నాస్తి ” యన్న నమ్మకము నాకు మొదటినుండియు లేదు. అందుచేత "నేను కొడుకును పెంచుకోవలెనని యెప్పడును దలఁచుకొనలేదు. నాకుఁగల యల్పమైన, సొత్తును ధర్మకార్యమునకు వినియోగింపవలెనని నేనునిశ|్చయించుకొంటిని. יחסי యుద్దేశమును నేనెప్పడును మఱుఁగు పటుపలేదు. వీరేశలింగమునకు తన మేనకోడలినిచ్చి వివాహముచేసి యతనిని తనయొద్దనంచుకోవలెనని నాభార్య యుద్దేశము. ఆమె కోరికకు నేనడుచెప్పలేదుగాని బాల్యవివాహముల