పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్వీయ చ రి త్ర ము كح 3 و. సింగయ్యవిరచితమైన ప్రబోధచంద్రోదయ పద్యకావ్యము, కేతనార్యకృత మైన దశకుమారచరిత్రము, エですe@ యన్నయార్యకృతమైన సుదక్షిణాపరిణ యము, అనంతా మాత్యవిరచితమైన భోజరాజీయము, నందిమల్లయ ుంటసింగ యార్య ప్రణీతమైన వరాహపురాణము. ఫైవానిలో హరిశ్చండ్రోపాఖ్యా నమును జైమినిభారతమును పూర్వమే ముద్రింపఁబడెను గాని యవితప్పలతడి కలుగా నుండినందున సంస్కరించి మరల ముద్రింపించితిని. నేను తాళపత్ర పుస్తకములను విస్తారముగా సంపాదించి కట్టలుగానుంచితిని. "నేను రాజ మహేంద్రవరములోనుండిన కాలములోనె చెదలుపట్టి వానిలో బహు పుస్తక ములునశించెను. మిగిలిన వానిని నాతో చెన్నపట్టణమునకుఁగొనిపోఁగానక్కడ సహితవు పురుగుపట్టి యధికసంఖ్యగల పుస్తకములు చెడిపోయెను. శేషించిన వానిని కాపాడుట కష్టముగా కనఁబడినందున సగము సగము చెడియ3 చెడక యు నున్న మిగిలిన పుస్తకముల నొక మిత్రుని కిచ్చివేసితిని,