పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్వీ య చ రి త్ర ము . ירי מי aప్పించి నేను చదివితిని. చెన్నపురి చిత్రవస్తుప్రదర్శనశాలలోనున్న తావ్రుశాస నములను జదివితిని. ధనమిచ్చికొనియు మిత్రులసాహాయ్యమున నెరవుపుచ్చు గ్చా మాతృక లకుఁ బ్రతులు వ్రాయించియు కట్టలుకట్టిమూలఁబడియున్న పుస్త కములను గొందఱూరకయియ్యఁగా వందనపూర్వకముగాఁగైకొనియు ముద్రి తములుకాని తాళపత్ర పుస్తకములను విస్తారముగా సంపాదించితిని. తంజావూరి లాశని సరస్వతీ భాంధాగారములో తెలుఁగు పుస్తకములున్నవని విని యా కాలము నందక్కడ మండల న్యాయాధిపతిగానుండిన హామ్నెట్టు ら"3でYや8 సాహాయ్యమున నక్కడనున్న తెలుఁగు పు స్తకములపట్టికను సంపాదించి నేను స్వయముగా నక్కడకుఁబోయి పుస్టకములు చదివి వానిలాగోనుండి నాక్షస కావ వలసిన భాగములను వ్రాసికొని వచ్చితిని. ఆంతేకాక యక్కడనున్న పెక్కుపుస్తకములకుఁ బ్రతులను వ్రాయించి తెప్పించితిని. మూఁడుసంవత్సరములు వరు స గా వేసవికాలపు సెలవులలో చెన్నపట్టణమునకుఁబోయి యక్కడి ప్రాచ్య లిఖిత పుస్తక భాంధాగారమునకు ప్రతిదినమును పగలు పదిగంటలకు భోజ నముచేసిపోయి సాయంకాల మైదు గంటలనఱకు నక్కడనుండి తాళపత్ర లిఖిత పుస్తకములను జదివి వానిల*నుండి -s-వలసిన భౌగములను వ్రాసికొను చుంటిని. ఒకనాడు ట్రాముబండిలా నెక్కి పోయి సముద్రతీరమునదిగి పుస్తకభాగములను వ్రాసికొనవలెనన్న యజ్ఞేశముతో నక్కడనుండి కోటకు నడిచిపోయి కావలసిన పుస్తకమును ు స్థక భాంధాగారమునుండి పైకితీయించి వ్రాసిప్రోఁబోఁగా నా కంచుక కోశము (బొక్కా జేబు) లోని వ్రాఁతపు స్టక ము కనఁబడలేదు. ట్రాముబండిలో దానిని విడిచి వచ్చితినని వెంటనే మరల సముద్రతీరమునకుఁబోయి మతియొక ట్రాముబండి నెక్కి విద్యుద్బలో త్పాదక స్థానమునకు వెళ్లి యచ్చట మొదట నెక్కివచ్చినబండిని నడుపువానిని కనుఁగొని యడుగc7గా నతఁడేదో వ్రాఁతపుస్తకము బల్లమిందనుండఁగా క్రిందపాఱ వైచితినని చెప్పెను. అతనిబండిలో మరల సెక్కి యాతఁడు పుసకమును పాఱ వేసితినన్న స్థలమునకు వచ్చి దిగి యాసమిపమున వెదకి చుట్టుపట్టుల వారిని విచారించి పు స్తకమిచ్చినచో సొమ్మిచ్చెదనని గూశపెట్టితిని గాని هك كاوو زقي