పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

Ου ΤΕ. స్వీ య చ రి త, ము గీ. పరుల మోసము చేసెడు వారుకూడఁ బొగులుదురు తమ్మఁ బరులింత మోసపుచ్చ; కడకు వంచన వ్యధ తెచ్చుఁగాన మనుజు లాంజొరసల మోసపుచ్చక యుండవలయు. λ. ప్రజలు తమదోషముననె విపత్తులాంది నిలుపుదు రదృష్టదేవతతలను చప్ప; ధరణిఁ దమకీడు మేళ్ల కుఁ బాసెుకాని కాదు భాగదేవత యెందుఁగారణంబు. గీ. క్రొత్తవారికి మదిభీతిఁ గొలుపుచున్నఁ బరిచితులకు హాస్యార్ధుఁడౌ వదురుఁబోతు; ఆఱపులనుబట్టి సింహంబులట్లయున్న గాడిదలె చేష్టలందుఁ బెక్కండ్రు జనులు. Α. ప్రజలనందఱ సంతోషపఆుపఁగోరి యెల్ల రకు నింపుగ మెలంగ నెంచువాఁడు పిదప నెవ్వరి సంతోష పెట్టలేక యన్నిటికిఁ జెడ్డ ముతిహినుఁడగును జమ్మ 1889-వ సంవత్సరమునందు శ్రీలక త్యావశ్యకములైన శరీరారోగ్య ధర్మములను బోధించెడు “దేహారోగ్య ధర్మబోధిని" యను గ్రంథమును జేసి తిని. 1896వ సంవత్సరమునందు “పత్నీహితసూచని" యను గ్రంథమును జేసి ప్రకటించితిని. ఇందు శ్రీలయొక్క యార్తవకాలమునందును, గర్భధా రణస్థితియందును, శిశుపోషణ సమయమునcదును, నడవవలసిన మార్గములును జేయవలసిన ధర్మములును రాఁదగిన రోగములును తన్నివారణార్థ వూచరింప వలసిన చికిత్సలును సామాన్యముగా వివరింపఁ బడినవి. 1889–వ సంవత్సరమునందు సతీహితబోధినియను నామముతో తన్నా w:ును వహించిన శ్రీలపత్రికలోని యుపయు క్తములయిన ముఖ్యవ్యాసముల