పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా కృషి సఫలమయినది కాదు. అయినను నేను నా యుద్యమము నంతటితో విడిచిపెట్టక పట్టణమందిరనిర్ఘాణమున కయి పరమధ్యమున ధర్శవైద్యాలయ వీధి యందొక స్థలమును దామరాజు నాగరాజుగారి పేర కొనియుంచి, శ్రీ విక్టోరియా Gр మహారాజ్ఞగారి జ్యూబిలీ మహోత్సవ సందర్భమున 1887 వ సంవత్సరమున చందాలచేర్చి పురమందిరమును కట్టింపవలెనని మరల ప్రయత్నము చేసి యోుక సభకూర్చితిని. పురమందిర నిర్హాణార్థమయి శ్రీ పిఠాపుర రాజు గారు వేయి రూపాయలను దయచేసిరి; చందాల మూలమున నయి గాఱునూఱులు పోఁగయి నవి. మందిర నిర్మితికయి పలువూలు సభలు చేయఁబడుచు వచ్చినవి. ఈ సభలలో పట్టుమని పదిరూపాయ లియ్య సాహసింపని యుదారపురుషులు నేను కష్టపడి తిరిగి వ్రాయించి తెచ్చిన భవనాకృతిలో లా^పము లేంచుచు లక రూపాయలు వ్యయ పెట్టి దివ్యభవనము కట్టిqపవలెనని కొందఱును, "నేను కొన్న స్థలము బాగు లేదని దోషము లెన్నుచు జనో ద్యానముగా నుపయోగింపఁ దగిన నుందర విశాల స్థలమును పరమధ్యమున సంపాదింపవలెనని కొందఱును, ఆచరణసాధ్యములు కాని చిత్రవిచిత్రాభిప్రాయముల నియ్యఁజొచ్చిరి. ఈ ప్రకారముగా రెండు సంవత్సరములు సభలు జరగినపిష్టట వృధాకాలహరణ మగపటు తప్ప నిట్టి సభలవలన కార్యము కలుగఁబోదని నేను తలఁచి, ఒక నాఁటి పుర మహాజనులసభలో నా యభిప్రాయమును వెల్లడించి 1889వ సంవత్సరము మార్చి నెల 28వ తేదిని ముద్రితమైన యీ క్రింది లేఖను చందాదారులకుఁబంపితిని--

“Sir, I beg to inform you that, from my experience of the last ten years during which I have been working to secure a public hall for our town, I have had ample reasons to believe that there are no chances of our Town Hall ever coming into existence by means of public subscriptions and that I have therefore made up my mind to have the Hall built at my own expense (independently of public subscriptions) in the site opposite to the Town School by the Hospital Road which I already purchased with my own money for the purpose. I am