పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

од о స్వీ య చ రి త, ము పోయినను కాళిదాసునివంటి మహాకవి యొక్క యు త్తమ నాటకరచనయందే తప్పిపోవలయునన్న బుద్ధిచాపల్యమును మరలించుగోలేక దీనియాంధ్రీకరణము నక్షసఁ బూని నాచేతనైన బ్లెట్లో దీని నిర్వహింపఁగలిగినాఁడను. నా పుస్తక మును జదివిన వారా-కాలమున నా భౌషాంతరము మనోహరముగానున్నదనియే చెప్పచువచ్చిరి. వారట్లనుటకు నామినాఁది యాదరణమే కారణవుయి యుండ వచ్చును. ఇదియొక సారి ప్ర థమశాస్త్రపరీక్షకుఁబఠనీయగ్రంథముగా సహితము నిర్ణయింపఁబడెను. నాటకసమాజములవారు గీనిని బహుస్థలములయందుఁ బ్రదర్శించిరి నేను దీనిని రచించినతరువాత దాదాపుగాఁ బదేండ్లకు గీనికంశెు, నెక్కువమనోహరముగా నుండవలెనని కె స్తనకలాశాలాపండితులగు రాయన దుర్లము నరసయ్యశాస్త్రిగారు శాకుంతలమును మరలఁ దెలిఁగించిరి ; ఈ "όοέβ, కంటెను నధికరమ్యము గానుండవలెనని రెండు మూఁడేండ్ల తరువాత చెన్నపురి క్రైస్తవకలాశాలా సంస్కృతపండితులగు వేదము వేంకటరాయశాస్త్రిగారు వెండియుఁ దెలిఁగించిరి; తరువాత మతి రెండేండ్లు తాళి వూటికం లేును ముద్దుగా నుండవలెనని దాసు శ్రీరామపండితులవా 8ంకొక భాషాంతరము చేసిరి ; ఇన. న్నియు నిట్లుండఁగా నన్నిటినిమించి య్యంత హృద్యముగా నుండనలెనని మఱి యెనిమిదేండ్ల కనఁగా నేను భాషాంతరీకరించిన యినునదేండ్లకు తరువాత వడ్డాది సుబ్బారాయఁడు గారు వేeరొక భౌషాంతరము చేసిరి. నా భాషాంతరము గూఢపదములను ప్రాధాన్వయములను లేనిదయి పామరులును గ్రహించు. నట్లుగా తేటతెల్లమయియుండును. తక్కినవారి భాషాంతరములు కఠినపద భూయిష్టములయి పౌఢతరాన్వయ విశిష్టములయి పండితజన గ్రాహ్యములు గా నుండును. అయినను సామాన్యజనులుమాత్రము నా పుస్తకమునే యొక్కువ గాఁ జదువుచు నిప్పటికిని సమాదరము చూపుచున్నారు. ఆందుచేత నా పుస్తు కము పెక్కుతడవలు ముద్రింపఁ బడవలసినదయ్యెను. నా భౌషాంతరీకరణరీతిని జూపుటకు నా శాకుంతలములోని పద్యములను గొన్నిటి నిచ్చట నుదాహరించు చుచున్నాను