పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంవత్సరకాలము చెన్నపురిలాగో నేయుంటిని. ఈలోపల రాజమహేంద్రవర మున కొక్కసారిపోయి రెండు మూడు మాసము లక్కడనుండి మిత్రులతో నాలా?*.చింః్చ రాజమహేంద్రవరములో స్థిరముగానుండుటకు నిశ్చయము చేసి $Tని మరల చెన్నపట్టణమునకు వచ్చి యిండ్లు మొదలైన వానినన్నిటిని వచ్చిన వెలలకమి చేసితిని. వితంతు శరణాలయము నిమి త్తమయి నాలుగు వేల రూపా యలు వ్యయము చేసికట్టించిన యింటిని తోఁటను మూడువేల రూపాయలకే యియ్యవలసినవాఁడనైతిని. ਨ੍ਹਾਂ పెద్దగుఱ్ఱమును బండిని తొంబదిరూపాయల కమ్మివేసితిని. చింతా"నుడి ము: దాయంత్రమును, దాని పరికరములను, ముద్రాక్షరములను గూడ విక్రయింప నుద్దేశించుకొంటిని గాని రాజమహేం. దవరము లోని మిత్రులు దానిని తేమని గ్రోరినందున మున్నూఱురూపాయ లయో మార్గభృతి నిచ్చి తీసికొనివచ్చితిని. ఈ ప్రకారముగా చెన్నపురిలో నాకున్న పన్నియు నమివేసి 19Uు-వ సంవత్సరములో మరల స్వస్థలమయిన రాజముహేంద్రవరము చేరిత్రిని.