పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



సంపాద కీయభూమిక

శ్రీ రావు బహదూరు కందుకూరి వీరేశలింగము పంతులువారి స్వీయచరిత్రలోని మొదటి భాగమును 1911 సంవత్సరములోఁ బ్రకటించియున్నాము. అప్పటనుండి ప్రయత్నించుచున్నను: అనివార్యము లగు కొన్ని కారణములచేత, రెండవభాగమును, ఇంతవఱకును బ్రకటింపఁ జాలమైతిమి.

ప్రథమసంపుటము వెలువడినప్పటినుండియు వారికి శరీరారోగ్యము చక్కగా లేకున్నను, అధిక శ్రమలకోర్చి, దీనిని రచించి మాయుద్యమమునకుఁ బ్రోత్సాహముఁ గలిగించినందులకు వారికి మాకృతజ్ఞతా పూర్వక వందనముల నర్పించు చున్నాము.

గ్రoథమునందు సమకాలికులగు ననేకులంగూర్చి సందర్భానుసారముగ పంతులవారు, ఒక్కొకచో భూషించుచు నొక్కకచో దూషించుచును వ్రాసియున్నారు. స్వియచరిత్రమువంటి గ్రంథమునందు, ఇట్టి దూషణ భూషణములుండుట వింతకాదు. అట్లు కాని యెడల స్వీయ చరిత్రము, స్వభావమైన