పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

Оо8 స్వీయ చ రి SКээ رق తేదిని కార్యమును జరపి వధువును మగనివద్ద విడిచి నేనును నా భార్యయ రాజమహేంద్రవరమునకు వచ్చితిమి. వచ్చిన దినముననే మార్గాయాసము కొంచెము తీతిన తరువాత సాయంకాలమున పురమందిరమునకుఁ బోయితిని ఆక్కడ సుబ్బారావు పంతులు గారు మొదలైన మిత్రు లనేకులుండిరి. సుబ్బా రావు పంతులుగారితో మాటాడి నేను విజయనగరము వఱకును బోవుటయు, గతదినముననే గజపతి నగరములో నాయన శమ్మని వివాహమును జరపి చెన్న పట్టణము పోవుటకయి తిరిగి వచ్చుచుండుటయు చెప్పి, తమ్మని వి'వాహ వార్తను నేనే యాయనకు మొట్టమొదట నివేదించితిని. నేనా వార్త తెలిపి నప్పడాయన మొగమునందు కొంచెము వైవర్ణ్యము కనఁబడెనుగాని కోప చిహ్నము లేవియుఁ గానరాలేదు. ఆయన యిఁక నచ్చట నుండక బండియొక్కివెంటనే యింటికిఁబోయిరి. నేను పురమందిరమునందు మతీ కొంతసేపుండి మిత్రులవద్ద సెలవు పుచ్చుకొని యింటికిఁబోయితిని. మఱునాఁడు మిత్ర సందర్శనార్థమయి "నేను సుబ్బారావు పంతులుగారి యింటికిఁబోయి నప్పడు మా యిరువురకను జరగిన సంభాషణము మిత్ర సమావేశ సమయమున జరగఁ దగినదిగానుండలేదు. ఆయన నన్నేమియు పరుషభాషణము లాడక పోవు టయేకాక దూషణముచేయఁదొడఁగిన తల్లిని వారి0చినను "నా విషయమైకోప, మును ననాదరమును జూపిరి. సేనచ్చట నిలువక వెంటనే సెలవు పుచ్చుకొని బైలుదేతి యాయన యప్పటి కోపోద్రేకమును దలఁచుకొని, యాయనకు వివాహమునకు ముందు చెప్పకపోవుటయే మంచిదయ్యె ననియు, చెప్పి యుండిన యె:ల తల్లియు నన్నగారును ముందు నిలిచి s*క్రించుచు కోపిం చుచు వలదని వారించుచున్నప్పడు వారిని నిరాకరించి కార్యముచేసికొను నంతటి ధైర్యము శేషగిరిరావు పంతులుగారి కండియుండ దనియు, త్రోవ పొడుగునను నాలాగో నేననుకొనుచు మా యింటికి నడచితిని. మొదటి నుండియు వితంతు వివాహకార్యములయం దంత యభిమానము కలవారయి కార్య నిర్వహణ విషయమున నాకెన్నియో విధముల సహాయపడుచుండిన సుబ్బారావు పంతులుగారికి తమ్మఁడు వితంతువును వివాహము చేసికొన్నంత