పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

デーど స్వీయ చ రి ము رانی వచ్చినవి. జయప్రదముగా జరగుచున్నవని శ్లాఘింపఁబడుచు వచ్చిన సంస్కార భోజనముల కాహూతుఁడ నయి యొకసారి నేను పోయితిని. భోజనమునకు పోవఁదలఁచిన వారియ్యవలసిన యర్థరూప్యమును నేను ముందుగా సే చెల్లించి తిని; రాకపోకలకు నాకు బండికూలి యెనిమిదశాలయినది. ఈ భోజనములు పురనుందిరములోని యొకగదిలో నేర్పాటుచేయఁబడినవి. దాక్షిణాత్య Ա:బ్రాహ్ర్మణుఁ శొకఁడు వంటచేసి యొకXదిలో వడ్డన చేయఁగా నేడెనమండ్రు కలిసి భోజనములు చేసిరి ; అట్లు భోజనములు చేసినవారిలో నిద్దఱు బ్రాప్త శేతరులు సహితముండిరి. చేతిరూపాయ వదలినను దాక్షిణాత్యభోజనము నాకు సరిపడనందున నింటి కాకలితో వచ్చి మరల భోజనము చేయవలసిన వాఁడ నైతిని. భోజనమయిన తరువాత సావకాశము గా కూరుచుండి సంస్కార భోజనము యొక్క శ్లాఘ్యతనుగూర్చియాలోచింపఁగా దాని యాధిక్యముగాని యందలి విశేషముగాని నాకు బోధపడినదికాదు. ఇంకొకసారి యడిగి తెలిసికో వలెనని తలఁచియుండఁగా మరల సంస్కారభోజన దినము వచ్చినది. ఆసా రియు వెనుకటి వలె నీ నేను భోజనమునకుఁ బోయితిని గాని నెనుకటి భోజనమును బట్టి యొక్కు_న రెలివిXలసాఁడవయి యీ సారి "యింట భోజనము చేసి మఱి పోయితిని. తక్కినవారు భోజనమున కారంభించియాఁకలి తీర్చుకొనుచుండఁగా కడుపు నిండి నుండినవాఁడ నగుటచేత మాటల కారంభించి నేను నా సంశయ ములఁ దీర్చుకొనుచుంటిని. ఈ సంస్కార భోజనములో విశేష మేమియని మొదట నడిగితిని.ఇందు బ్రాహ్ర్యణులును బ్రాహ్ర్మణేతరులను గలిసి సహపం_క్తిని భోజనము చేయుట యని యుత్తరము చెప్పిరి. ఈ వచ్చినవారి పేరులును భోజ నము చేసినవారి పేరులును వృత్తాంత పత్రికలలో ప్రచురింతురా యని మరల నడిగితిని. పేరులు ప్రకటింపఁబడిన యెడల నీ భోజనములే యుండవని యొకరు బదులుపలికిరి. మాయవేషములయందు స్వభావ ద్వేషముగల నేను విని యూర కుండఁజాలక పేరు లితరులకు తెలియుట కిష్టము లేని కార్యభీరులు వు:58 శూరులవలె సేఁటి సంస్కా_రభోజనము బహు జయప్రదముగా జరగినదని వార్తాపత్రికలలో ప్రకటించి దూరపువారిని ప్ర తారించుట యేమి పౌరుషమని