పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్వీ య చ రిత్ర ము הטהט కొని యప్పుడు తాళ్లు-డిలో తాలూకా హేడ్డు గుమాస్తాగా నున్న మా నూరి పురుషోత్తము పంతు లవివాహితుఁడయి యుండెను. ఆయనకు వ్రాసి పిలి పించి విచారింపఁగా వితంతువును వివాహమాడుట కతఁ డంగీకరించెను. ఆం తట నాతనిని మృత్యుంజయరావుగారి యింటికిఁబంపి, యచ్చటి కాయనభార్య చేత వధువును పిలిపించి, ఉభయులను మాటాడించితిమి. వధూవరు లిరువు రును పరస్పరానురాగము గలవారయి వివాహమున కొప్పుకొన్న తరువాత 'రెండు మూడు సారసలు వారిని మృత్యుంజయరావుగారి యింటనే మూ టూ డించి యొక భానువారము నాఁడు వివాహ ముహూర్తము నిర్ణయించి యా దినమున ప్రాతఃకాలముననే వచ్చి మా యింటనుండవలసిన దని వరున కుత్తరము వ్రాసితిని. ఆ దినముననే మా యింటికి వచ్చుట కయి వధువుతోడఁగూడఁడెలిపి యేర్పాటుచేసితిని. నధూవరు లిట్లు రహస్యముగా మాటాడుకొనుచున్న సం గతి తల్లిదండ్రులకుఁ గాని బంధువులకుఁ గాని యితీరులకుఁగాని తెలియదు, చూచినవారు వరుఁడు తన మిత్రుఁడైన మృత్యుంజయరావుగారిని చూచి మాటాడి పోవుటకొఱకే యచ్చటికి పోవుచున్నాఁ డనుకొనిరిగాని వధువుతో మాటాడుట కొఱకని యెవ్వరును భావింప లేదు. సా యుత్తర ప్రకారముగా ముహూర్తదినమున వరుఁడు వచ్చి మా యింటఁ బ్రవేశించెను. వధువురాకను బ్రతీకీంచుచు నేను సాయంకాలము నాలుగు గంటలవఱకును వూ యింట వేచియుంటిని గాని యప్పటికిని వధువురానందున రాఁగానే సమాచారము పంపవలసిన దని నా భార్యతో చెప్పి “ਜੰੇ ਹ` మిత్రు లయిన నుబ్బారావు పంతులు"గారి యింటికిఁ బోయి వూటాడుచుంటిని. ఇంతలో నొక భృత్యుఁడు వచ్చి యవుగారింటికి రమ్లన్నారని చెప్పెను. నేను సంగతి గ్రహించి వెంటనే యాయనవద్ద సెలవుగైకొని బైలుదేతి వచ్చునప్పుడు త్రోవలో నా మిత్రులైన పోలీను ఇన్ స్పెక్ట్చరు గువ్రుడిదల మనోహరము పంతులుగారిని కలిసికొని నేను వర్తమానము చేసినప్పుడు పంపుటకు రకకభటులను కొందతిని సిద్ధ ము"గా నుంచుమని చెప్పి యింటికి వచ్చితిని వధువుయొక్క బంధువులు కొందఱు పట్టణములో ప్రముఖులుగా నున్నారని యొఱిఁగిన వాఁడనయి