పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

79

యుఁ జేయుచుండిన కాలములోనే నావెనుక నొకరు కూరుచుండి నావీఁపు మీఁద, నప్పుడప్పు డొకపువ్వు వేయుచురాఁగా, ఆపుష్పములసంఖ్యయు సరిగానే చెప్పితిని. ఈపనియంతయు ముగియుటకు రెండుగంటల కాలము పట్టినది. అష్టావధానము చేయఁగలుగుట ధారణాశక్తిచేత ననుకోక సామాన్యజనులు మంత్రశక్తియని భ్రమించి, కాదని నామిత్రులు చెప్పినను నమ్మక, నాకుచ్ఛిష్టగణపతి యుపాసన యున్నదని నేను గోఁచి పెట్టుకొంటినో లేదో యని నా వెనుకకువచ్చి కొందఱు చూడసాగిరి. ఇది జరిగినతరువాత రాజమహేంద్రవరములోని మిత్రులక్కడఁగూడ జేయవలసినదని నన్నడిగిరి. అందు చేత నే నొకభానువారమునాఁడు రాజమహేంద్రవరమున విశాలమయిన మా యింటిచావడిలోనే యష్టావధానము చేసితిని. నే నష్టావధానము చేయుదు నన్న వృత్తాంతము పట్టణములోఁ దెలిసి జనులు గుంపుగుంపులుగా వచ్చి మూఁగఁ జొచ్చిరి. అప్పుడు తావు చాలక మావీధితలుపులు మూసివేయవలసి వచ్చినది. అష్టావధానము ముగిసినతరువాత తలనొప్పి వచ్చి యారాత్రి నే నెంతో బాధపడితిని. ఊరక పామరుల వేడుకకొఱకుఁ దక్క దీనివలన లోకమునకుఁ గాని నాకుఁగాని నిజమైనప్రయోజనము లేదని భావించి, తరువాత నెంద ఱెన్ని విధములఁ బ్రార్థించినను మేదస్సునకు వేదనాకరమైన యష్టావధానమును జేయ మానితిని.

మావివేకవర్ధని తన కాఱుమాసములు వచ్చినదిమొదలు గొప్పవారిలోని, దుర్నీతిని మాన్పుటకయి ప్రయత్నింప నారంభించినది. అప్పుడు మామండల న్యాయసభలో న్యాయవాదిగా నుండినవా రొక రొక వేశ్యకు కన్నెఱికము చేయఁగా, వివేకవర్ధని దానిని ప్రకాశపఱిచి యాఘనుని సిగ్గుపడునట్లు చేసినది. ఆరసిక పురుషుఁ డప్పటి కేమియుఁ జేయలేకపోయినను తన్న వమాన పఱిచినందునకు మనస్సులో ద్వేషము వహించి పగ తీర్చుకొనుటకయి సమయముకొఱకు వేచియుండెను. అట్లు ప్రతీక్షించుచుండిన సమయము సహిత మాపయినెలలోనే తటస్థించెను. యోగినిగాను భక్తురాలుగాను నుండి యొక