పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

75

                నెవ్వఁ డాకసంబున నేల నెల్లనీళ్ల
                మెలఁగు పులుఁగుల మొగముల మీలగములఁ |
                దగినయోరెంబుఁ గలిగించి నెగడఁ జేయు
                నట్టిదేవర మమ్ముఁ జేపట్టుఁ గాత !||

            సీ. తనకృపారసవృష్టి దాసుల తాపంబు
                        లణఁగించి నెగడించుఘనుఁ డెవండు |
               తనదివ్య తేజంబునను భక్త జనతమో
                        ని చయంబు మాయించునినుఁ డెవండు |
               తనశీతలాలోకమునఁ గువలయమును
                        వెలయించుచల్లని వేలు పెవఁడు |
               తనజగద్వ్యాపకత్వంబుమై లోకాళిఁ
                        బాలించునలజగత్ప్రాణుఁ డెవఁడు |

               అట్టిపరమేశ్వరుండు దయాసముద్రుఁ
               డాదరాయత్తచిత్తుఁడై హర్ష మెసఁగ |
               మాదు విన్న ప మాలించి మఱచిపోక
               మమ్ము ననిశమ్మును భృశమ్ము మనుచుఁ గాత ! |

లంచములు తగవన్న, రాజకీయోద్యోగులకుఁ గోపము; వేశ్యాంగనా సంగము నీతి గాదన్న, శృంగారనాయకులకుఁ గోపము ; పూర్వాచారమును మార్చుకోవలెనన్న, పామరజనులకుఁ గోపము ; నీతిమాలిన బాహ్యవేషములు మతవిరుద్ధములన్న, ఆచార్య పురుషులకుఁ గోపము. మాపత్రికోద్దేశమును నిశ్శంకముగా నిర్వహింపవలసినచో నిన్ని కోపములను సరకు చేయకుండవలెను. తన మీఁదఁ బడినయీభారమును మావివేకవర్ధని కొంతవఱ కయినను నిర్వహింపఁ గలిగినదో లేదో ముందుముందు చెప్పఁబోయెడు దానినిబట్టి మాచదువరులే తమకుఁ దోఁచినయభిప్రాయముల నేర్పఱుచుకొందురు గాక !

స్త్రీవిద్యనుగూర్చి యాంధ్రభాషాసంజీవనిలోను పురుషార్థప్రదాయినిలోను వాదప్రతివాదములు నడుచుచుండినట్లు ముందే చెప్పఁబడెనుగదా. స్త్రీ