పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

స్వీయ చరిత్రము.


            శా. శ్రీమార్తాండమరీచిరోచి యనఁ గాఁ జెన్నై దివాంధావళిం
                భ్రామన్ గ్రాల్పురుషార్థదాయినిపతీ ! పద్యాళి సంజీవనిన్
                శ్యామాలోకము కెల్ల విద్య వలదం చష్టావధాన్యాహ్వయుల్
                తా మీమాసము వెల్ల డించుటలు మోదం బొప్ప వీక్షించి తే ?

            చ. మునుపటివారు చెప్పినది మొక్కలపున్మది పూని సర్వముం
               గొనఁ జనదంచు నామతముకూడ లవంబును గాదు, కాని యెం
               దును మనబుద్ధికూడఁ గడుఁ దూరిచి యారయుచుంట ముఖ్యమై
               చనును హితహితంబులపసల్ గని దుష్కృత ముజ్జగింపఁగన్.

           మ. అయినన్ ముద్దియవిద్దియంగుఱిచి యెందై నం దగం దొంటియా
               నయవేదుల్ తగదంచు వాదములు పూనం గంటిమే మీవలెన్ ?
               దయ మీఱంగను జెప్పుఁ డయ్య యలసిద్ధాంతంబు లెందైన మీ
               నయనానందము చేసెనేమొ వినఁగన్ గౌతూహలం బయ్యెడున్.

           ఉ. వింతగ వాద మేల యవివేకులపోలిక ? స్త్ర్రీలవిద్య సి
               ద్ధాంతమె చేసినారు మనతద్ జ్ఞులు పూర్వులు ; వేద మొక్క టే
               యింతులు చూడఁ గూడ దని రింతె ; పురాణచయంబు స్త్రీలకై
               యెంతయుఁ జేయుటల్ స్మృతులు నెల్లపురాణము లొత్తి చెప్ప వే.

మనవారు సాధారణముగా యుక్తియుక్తముగాను సప్రమాణము గాను వాద ప్రతివాదములుచేయుట మాని నడుమ వక్తవ్యాంశమును విడిచి యన్యోన్యదూషణమునకు దిగుదురు. స్త్రీవిద్యానిషేధవాదులు స్వవాద దౌర్బల్యమునుబట్టి కాఁబోలును ముందుగాఁ బ్రతివాదిదూషణమున కారంభించిరి. అప్పుడు నేనును సైరణ వహింపక స్వాభావికా గ్రహమునుబట్టియు యౌవనాహంకారమునుబట్టియు విజిగీషాదురతిశయమునుబట్టియు ద్విగుణముగా దూషణమునకుఁ