పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవతారిక.

పనిచేసి చూపవలయునన్న చింతయేకాని నన్నుఁగూర్చి నేను చెప్పుకోవలయునన్న యభిలాషము మొదటినుండియు నాకంతగా లేకుండెను. 1888-వ సంవత్సరమున వేసవికాలపు సెలవులకు ముందు నాప్రాణమిత్రులయి యుండిన బసవరాజు గవర్రాజుగా రొకనాఁడు నాయొద్దకువచ్చి యింగ్లీషుభాషలో నాజీవితమును తాను వ్రాయ నుద్దేశించుకొన్నట్టు చెప్పి దానికిఁ గావలసిన సాధన సముదాయమును తన కియ్యవలసినదని నన్నడిగిరి. నేనాయన యుద్యమమును బ్రోత్సాహపఱుపక శ్వాసకాసాది రోగపీడలచే దుర్బల శరీరుఁడయి యున్న నేను చిరకాలము జీవింపననియు, దృఢగాత్రులయి యున్న మీరు చిరకాలము జీవింతురు గనుక నా మరణానంతరమున నాజీవితచరిత్రమువ్రాయఁదగినదిగాతోఁచినపక్షమున నప్పుడు వ్రాయవచ్చుననియు, చెప్పి, నామిత్రుని నప్పటి ప్రయత్నమునుండి మరలించితిని. ఈశ్వరచిత్త మెవ్వరికిని దురవగాహమైనది. ఏమి మాయయోకాని వ్యాధి బాధితమగు చున్న దుర్బలకాయముగల నేనిప్పటికి నీ ప్రకారముగానే యుండఁగా, దృఢకాయముగల యాతఁడే యల్పకాలములో నాకస్మికముగా నకాలమరణము పాలగుటచే నాతనిజీవితచరిత్రమును నేనే వ్రాయవలసిన యవస్థ నాలుగుమాసముల లోపలనే తటస్థమయ్యెను. తరువాత కొన్ని సంవత్సరములకు