పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదకీయ సూచన

ఈ స్వీయ చరిత్రము రెండు భాగములుగాఁ బ్రకటింపఁబడును; అందు నిది ప్రథమభాగము.

జగత్ప్రసిద్ధిఁగాంచిన రావుబహదూరు కందుకూరి వీరేశలింగము పంతులుగారే దీని గ్రంథకర్తలయి యుండఁగా నీ గ్రంథరచననుగూర్చి మేము వేఱుగ వ్రాయనక్కఱలేదు.

శ్రీ పంతులవారు తమ స్వీయచరిత్రమును ఈగ్రంథమాలలోఁ బ్రకటింప నంగీకరించి మామండలివారిని గౌరవించి నందులకు మేము వారికెంతయు కృతజ్ఞులము.

ఇట్లు,    

సంపాదకుఁడు.