పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

స్వీయ చరిత్రము.

మిదియొక్కటియేయని నానమ్మకము. ఈయసత్య దోషమునకై నే నిటీవల పెక్కుతడవలు పశ్చాత్తాపపడితిని. ఇప్పటివలెఁ గాక కొన్ని విషయములలో నబద్ధమాడ వచ్చుననియు, అవృతదురితము గాయత్రీమంత్రజపాదులవలనఁ బోవుననియు, బహువారపురాణపఠనదూషితమై యుండిన నాహృదయమున కప్పుడు సిద్ధాంతమైయుండెను. ఇట్టి దురాచరణములు పెద్దలవే యయినను పిన్న వారు వానిని ఆత్మానందవినాశకములైన మహావిషయములనువలెఁ బరిత్యజించి యసత్యము నెప్పుడును జిహ్వాగ్రమునకు రానీయక, సత్యము నే ప్రాణాధికముగా గ్రహించి, సదా సత్యాదరముగలవారై మెలఁగవలయును. "నా నృతాత్సాతకంపర"మని పెద్దలు ఘోషించియున్నారుగదా!

నాయందు మంచియభిప్రాయము గలవారు నాసహపాఠులైన విద్యార్థులుమాత్రమేకారు; ఉపాధ్యాయులకును నాయం దట్టిసదభిప్రాయమే ఉపాధ్యాయులలోఁ గొందఱు నాయం దతిదయయు పక్షపాతమును గలవారై యుండిరి. మామండలపాఠశాలలోని యప్పటి తెలుఁగు పండితులైన పులిపాక గురుమూర్తిశాస్త్రిగా రాంధ్రమునం దంతపాండిత్యము గలిగినవారు కారు. ఆయనకంటె నాకే తెలుఁగునం దెక్కువజ్ఞానము కలదని యప్పటిబాలుర యభిప్రాయము. ఆయాంధ్రోపాధ్యాయుఁడు మా తరగతిలోని బాలురకు పాఠములు నాచేతనే చెప్పించి యెప్పుడునున న్నగ్రస్థానమునందుఁ గూర్చుండఁబెట్టెడివాఁడు. ఎప్పుడేని బడికి పోక మానినప్పు డామఱునాఁడు నే నధమస్థానమునందుఁ గూర్చుండవలసినవాఁడ నైనను, ఏదోప్రశ్న వేసి యా యుపాధ్యాయుఁ డొక్కసారిగా నన్ను కడనుండి మొదటికిఁ బంపుచుండెడి వాఁడు; ఒక వేళ నడుమనుండిన బాలురలో నెవ్వఁడైన సరియైన యుత్తరము చెప్పినను వినిపించుకోక యతఁ డట్లేచేసెడివాఁడు; అటువంటిసమయములలో నేను లేచి యాబాలుఁడు సరియైన యుత్తరము చెప్పి యుండుటచే నాస్థానమునకతఁడే యర్హుఁడని చెప్పినను మా శాస్త్రి గారియొద్దఁ గార్యము లేకుండెను. మా పాఠశాలాప్రధానో పాధ్యాయులకును నానడతను బట్టియు తెలివినిబట్టి