పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

స్వీయ చరిత్రము.

వివాహాఖ్యమహాశక్తియొక్క శుభవీక్షణముచేతఁ గాదు. నాపెండ్లిలో మావారేవ్యయములను తగ్గించినను బోగముమేళమున కగు వ్యర్థవ్యయమును మాత్రము చేయక మానినవారు కారు. వేశ్యలు లేకున్న వివాహమునకు శోభయే లేదఁట! గృహస్థులగౌరవమునకు భంగము కలుగునఁట ! నలుగురిలో తలవంపులఁట ! మౌఢ్యజన్యములయిన యిట్టివిపరీతాభిప్రాయములకు మేరయెక్కడిది? విత్తమిచ్చి వేడుకకయి వేశ్యలను గొనివచ్చి పవిత్రములయిన యట్టిశుభ కార్యములను కులటాసాంగత్యముచే నపవిత్రము చేసెడి యీదురాచారము రూపుమాపెడు భాగ్యము భరతఖండమున కెప్పుడు కలుగునో! సంతతసత్ఫల దాయకమయిన పాతివ్రత్యకల్పతరుప్రవృద్ధికి మూలమయిన వివాహసంబంధ మెక్కడ ? పాత్రివ్రత్యదివ్యపాదమూలచ్ఛేదమునకు వరుపురుగు లనఁదగిన వేశ్యాంగనలసంబంధ మెక్కడ ? నాపెండ్లి కొక్కటికాదు మావా రొకటియు మాయత్తవారొకటియు రెండు బోగముమేళములను బెట్టిరి. నాభార్య యద్దంకి పట్టాభిరామయ్యగారి కొమారిత. తల్లి చిన్నతనములోనే కాలముచేసినందున మేనమామయు కా తేరికరణమునగు వెన్నేటి వేంకటరత్నము గారే యాచిన్నదానిని బెంచినాకిచ్చి వివాహము చేసిరి. సంతానము లేనివారయినందునఁ దమ మేనకోదలియం దాయనయు భార్యయుఁ దమ కడుపునఁ బుట్టినసంతానమునం దుండుదానికంటెను నెక్కువప్రేమ గలవారయి పెంచిన మోహముచేత పెట్టుపోఁతలయం దేలోపమును గలుగనీయక దయ చూపు చుండిరి. ఆచిన్నది పల్లెలలోనే పుట్టి పెరిఁగినదయినను మేనమామగారు బడికిఁ బంపుచుండుటచేతఁ బెండ్లినాటికే తెలుఁగు కొంత చదివినది. వివాహ దినములలో వేడుకకయి మాయిరువుర నొక్కచోటఁ గూరుచుండఁబెట్టి మాచేత రుక్మిణీకళ్యాణములోని పద్యములను జదివించుట నాకిప్పటికిని స్మరణకు వచ్చుచున్నది. వివాహమునిమిత్తమయి క్రొత్తనగలుకొన్ని చేయించినను నాతల్లి నాలుగైదువందల రూపాయలు వెలగల తన నగలను కోడలికిఁ బెట్టినది. నాభార్యకు జననీజనకులు పెట్టిన పేరు బాపమ్మ యయినను వివాహ మ