పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/377

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
364
స్వీయ చరిత్రము.my instance that the matter should be postponed till the apology was referred to you. A mahajarnama signed by about four hundred people was also presented to me requesting that Rangiah should be retained here. If you are willing to accept the apology tendered now, I shall not insist on his transfer as the man begs very hard to be saved. In reply to the Civil Surgeon's letter, the Surgeon General says you had every right to go and Rangiah Naidu had no business to interfere with you in any way." (మీరు చెన్నపట్టణమునుండి వ్రాసిన యుత్తరము నాకందినది. మీరారోగ్యము కలిగియున్నారని విని సంతోషించుచున్నాను. చెన్నపట్టణములోని గొప్పవారియొక్క సాహాయ్యముతో గాని సాహాయ్యములేక కాని యిక్కడి పునర్వివాహ సమాజముకొఱకు సొమ్ము సమకూర్చుటలో మీరు లబ్దమనోరథులగుదురని నేను కోరుచున్నాను....................

రంగయ్యనాయఁడిప్పుడు నిర్ణియమమైన క్షమార్పణమునుచేసియున్నాఁడు; అతని క్షమార్పణము వెంటనే యంగీకరింపఁ బడవలసినదనియు ఇక్కడి నుండి యతనిని మార్పకుండునట్లు సర్జను జనరల్ ప్రార్థింపఁబడవలెననియు కొంద ఱుత్కంఠులయియుండినను, నాకోరికపైని క్షమార్పణమును మీకు తెలిపెడు వఱకును ఈవిషయము నిలుపుచేయఁబడవలసినదని నిర్ధారణ చేయఁబడినది. రంగయ్య నిచ్చట నుంచవలసినదని కోరుచు సుమారు నన్నూఱుగురు వ్రాళ్లుచేసిన సంఘ విజ్ఞాపన మొకటికూడ నాకు పంపఁబడినది. ఇప్పుడు చేయఁబడిన క్షమార్పణము నంగీకరించుటకు మీరిష్ట పడినపక్షమున, అతఁడు రక్షింపవలసినదని మిక్కిలి ధీనముగా వేఁడుచున్నందున నేనతనిని మార్చు విషయమయి పట్టుపట్టను. సివిల్ సర్జనుయొక్క యుత్తరమునకు బదులుగా సర్జన్ జనరల్ వెళ్లుటకు మీకధికారము కలదనియు మిమ్మాటంక పెట్టుట కేవిధముచేతను రంగయ్యనాయనికి పనిలేదనియు చెప్పుచున్నాఁడు.)

ఈ రంగయ్యనాయఁడు రాజమహేంద్రవరములో నిల్లు కట్టుకొని కుటుంబముతో వాసముచేయుచుండెను. అతని నక్కడనుండి మార్చినయెడల