పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

357

లక్ష్మీనరసింహముగారు కోపమువచ్చినప్పుడు తొందరపడి యనాలోచితముగా పనిచేయువారయినను, స్వభావముచేత శాంత సమయమునందు న్యాయముచేయుటయందే దృష్టిగలవారు. ఇప్పు డాయన యెటుచేయుటకును పాలుపోని విషమావస్థయందు తగులుకొనియుండిరి. సమాజమువారి నిర్ధారణానుసారముగా తనతోఁజేర్చుకొన్న ధర్మకర్తలకు వ్యతిరిక్తముగా న్యాయమార్గమునకు మరలు నంతటి ధైర్యము కలవారు కాకుండిరి. ఈ యధిక ధర్మకర్తలన్ననో సామాన్య లాభము నిమిత్తము స్వలాభమును వదలుకొను నంతటి యవివేకులు కానందున వారు సూచింపఁబడిన యేర్పాటునకు వచ్చుట యసాధ్యము.

1888 వ సంవత్సరము అక్టోబరు నెల 17 వ తేదిని కోదండరామయ్య గారి ద్వితీయ వివాహము జరగినది. క్రొత్తగానియ్య నక్కఱలేక యీయన కిల్లీవఱకే యుండెను; నగలును ప్రథమభార్యవే యుండినవి. ఈయన సమాజముతోడి సంబంధములేక తనవివాహమును తాను స్వతంత్రముగా చేసికొనెదనని చెప్పినను, కార్యదర్శియొద్ద బదులని పుచ్చుకొని మరల తీర్పని రు 75 ల సమాజ ధనముతోనే వివాహవ్యయములు నడచినవి; సమాజమువారి వంట బ్రాహ్మణుఁడును పురోహితుఁడును వంటను వివాహతంత్రమును నడపిరి. తన వివాహమును తానే స్వతంత్రముగా చేసికొంటినని వ్రాసి లక్ష్మీనరసింహము గారి ద్వారమున సభాపతి మొదల్యారిగారు పెండ్లియొకటికి సమాజమున కిచ్చెదమని వాగ్దానముచేసిన నూఱురూపాయలును కోదండరామయ్యగారే తెప్పించుకొనెను; రామచంద్రయ్యరు గారిచ్చెడు నూఱు రూపాయలును తనకే పంపుమని వ్రాసెనుగాని యాయన తన సహాయధనమును సమాజమునకే యిచ్చెను.

తన యింటిలోని యొక భాగమునకు గోదావరివఱదచేత కొంతచెఱుపు కలిగిన తరువాత రామకృష్ణయ్యగారి మరణశాసనానుసారముగా మూడు భాగములుగా నుండిన యింటిని రెండుభాగములుగా ఆత్మూరి లక్ష్మీనరసింహము