పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

356

స్వీయ చరిత్రము.



బడుచున్నది. ఇది యెవ్వరికియ్యఁబడవలెనో యెవ్వరికి ముందియ్యఁబడ నక్కఱలేదో మీరొకగీతను గీయఁగలరా ? ఈప్రశ్నముయొక్క రెండవవైపు పుచ్చుకొనుఁడు. నిస్సంశయముగా కొందఱికి సాయమక్కఱలేక పోవచ్చును. కాని ప్రతిపురుషుఁడును సాయము కావలెనని కోరుచున్నాఁడు. వెంటనే సాయముకావలెనని కాకినాడలోని శ్రీరాములు తంత్రీవార్త పంపుచున్నాఁడు. అవిలంబ్యమైన యవశ్యకతకొఱ కతఁ డుత్తరము పంపుచున్నాఁడు. మన మెట్లు నిర్ణయింపవలెను? నిర్ణయించువారెవరు? తంత్రీముఖమున నతఁడేబదిరూపాయలు కావలెననెను. "నీకు రాఁగలిగిన 15 కంటె నెక్కువ రాదు" అని నేనిప్పుడు సులభముగా చెప్పఁగలిగితినిగదా ! తన భార్య యొక్క వైద్యసాహాయ్యముకొఱకు చెలపతిరావెన్నో లేఖలు వ్రాయుచున్నాఁడు. అతఁడు లేని స్థితిలో నున్నాఁడనియు మఱియొక లాగైనచో నతఁడు మిక్కిలి బాధపడుననియు నతని యుత్తరములు చూపుట మీరు కనుఁగొన వచ్చును. విధిగాని పద్ధతిగాని లేనిపక్షమున నేనేమి యుత్తరమియ్యఁ గలుగుదును? "15 రూపాయలకంటె నెక్కువలేదు. సరిపఱుచుకో" అని నేనిప్పుడు చెప్పఁగలను. తన బిడ్డ నిమిత్తము సొమ్ము కావలెను పంపుమని వెంకయ్య వ్రాయుచున్నాఁడు. 'నా యిల్లు వాసయోగ్యము కాకున్నది. నూఱురూపాయలు పంపనియెడల, అది పడిపోయి యప్రతికారమైన నష్టమును కలిగించును' అని కోదండరామయ్య వ్రాయుచున్నాఁడు. ప్రియ మిత్రుఁడా ! ఎట్లు ప్రత్యుత్తరమియ్యవలెను? ఆస్థితియందు మీరుండి మీరేమి ప్రత్యుత్తరము లియ్యఁగలుగుదురో చూడుఁడు. మీరు కోరినయెడల సంవత్సరకాలము నాయధికారములను మీకిచ్చెదను. మీరింతకంటె మంచి యేర్పాటుచేయఁ గలుగుదురేమో చూడుఁడు. వారి వివిధ ప్రార్థనలతో బాధింపఁబడుట నాకిష్టములేదు. నాయవిచ్ఛిన్నమైన యవధానమును వేదమున కియ్యఁ గోరెదను.)