పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

336

స్వీయ చరిత్రము.

'దాతయొక్క ప్రథమోద్దేశ ప్రకారముగా పదివేలరూపాయలమీఁది వడ్డిని ఈవఱకు వివాహముచేసికొన్న వారిలో సమానముగా పంచిపెట్టుటను గూర్చి నాయభి ప్రాయమడుగుచు ప్రకటన పంపినందు కనేక వందనములు చేయుచున్నాను. మీప్రకటననుబట్టి దాత మీతో నెప్పుడట్లు స్పష్టముగా చెప్పెనో సాక్ష్యము కనఁబడదు. మరణకాలమునం దాయన యుద్దేశమదియే యని మీరు మనఃపూర్తిగాచెప్పి సర్వసాక్షియైన యీశ్వరుఁడు సాక్షిగా మీరాయుద్దేశమును నెఱవేర్పఁ దలఁచుకొన్న పక్షమున, మీరిప్పుడు వివాహములు చేసికొన్న వారి యభిప్రాయములను పోగుచేయుటకేల పూనుకొన్నారో నాకు కారణము కానరాకున్నది. దాతయొక్క యుద్దేశమదియని మీరాత్మ సాక్షికముగా నమ్మినయెడల, వివాహములు చేసికొన్న వారొప్పుకొన్నను ఒప్పుకొనకున్నను కూడ మీ రాయన యుద్దేశమును నెఱవేర్చి యుండవలెను. వడ్డిని పండ్రెండు కుటుంబములలో సమానముగా పంచుకొనుటను గూర్చి నిబంధనలుగల తెలుఁగు లేఖ ననుసరించి మీరిప్పు డభిప్రాయములను పోగుచేయ నారంభించుటనుబట్టి యది స్వప్రయోజన పరత్వము నాధారము చేసికొని దీర్ఘాలోచనమీఁద తరువాత నేర్పఱుచుకొన్నదైనట్టు కనఁబడుచున్నది; దాతయొక్క యుద్దేశమదియగునాకాదాయని నాకు సందేహము కలుగుచున్నది. ఈపండ్రెండు కుటుంబములలో నైదైన నొకటి నష్టపడినయెడల దాని వంతుకూడ తక్కినవారు సమముగా పంచుకోవలెనని విధులు చెప్పుచున్నవి. ఎప్పుడైనను ఆఱు కుటుంబములు నష్టమగుట తటస్థించిన పక్షమున (సర్వదయాపరమూర్తియైన యీశ్వరుఁడట్టి వైపరీత్యము పుట్టకుండఁజేయును గాక!), వారి భాగములన్నియు మిగిలినవారికి రావలెననుట నా యభిప్రాయములో శుద్ధ స్వప్రయోజన పరత్వము.

వడ్డిని పండ్రెండు కుటుంబములలో మాత్రమే పంచి పెట్టుచువచ్చిన పక్షమున ముందు మనము వివాహములుచేయఁ గలుగుదుమా? వివాహములు చేయుటకు మాత్రము సొమ్ము పోగుచేయఁ గలిగినయెడల, క్రొత్తగా వివాహ