పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

327

పయి నిర్ధారణములనెల్ల నంగీకరించి క్రిందవ్రాలు చేయుటయేకాక లక్ష్మీనరసింహముగారు వీనినెల్లను జరపిరి. తరువాత 1886 వ సంవత్సరము సెప్టెంబరు నెల 8 వ తేదిని లక్ష్మీనరసింహముగారి క్షమార్పణ పత్రమును వివేకవర్ధని యీక్రింద తన వ్యాఖ్యానముతోను మొదటినుండియు జరగిన యుత్తర ప్రత్యుత్తరములతోను ప్రకటించినది. -

"మార్చి 31 వ తేదిని మెయినెల 12 వ తేదిని వివేకవర్ధనియందుఁ బ్రకటింపఁబడిన దంభాచార్యవిలసనమువలన కొందఱికి మనస్సునొచ్చినదని విని చాల విచారించుచున్నాము. హాస్య సంజీవని యుద్దేశమును పలుమాఱు మాపత్రిక యందు వెల్లడించియున్నాము. హాస్య సంజీవనిలోనుండు పురుషులు కల్పితులు; అందులో నొక్కరియందారోపింపఁబడియుండు విషయములు కొందఱివి కొన్ని గాను, మఱికొన్ని మఱికొందఱివిగాను, కొన్ని కేవల కక్పితములుగాను, ఉండును. దానియొక్క యుద్దేశ మెవరియందైన నట్టి లోపము లున్నపక్షమున, అట్టివానిని వారువారు దిద్దుకొనుటకేకాని మఱియొకందునకుఁ గాదు. కాఁబట్టి యెవ్వరును అందులో వ్రాయఁబడినవన్నియు తమ కొక్కరికే చెందుననికాని, తమరి నొక్కరినే యుద్దేశించివ్రాయబడినవనికాని, యెంచకుందురని నమ్ముచున్నాము. ఆప్రకారముగానే మార్చి 31 వ తేదిని మెయి 12 వ తేదిని దంభాచార్యవిలసనమను పేరిట ప్రకటింపఁబడిన హాస్య సంజీవనిలో నొక్కొక్కపురుషునియం దారోపింపఁబడిన విషయములన్నియు నాయొక్క పురుషునకే చెందునని యెంచుటయు న్యాయముకాదు. అట్లవియన్నియు తమయొక్కరి విషయమే యుద్దేశింపఁబడినవని యెవ్వరును తలఁప కుందురనినమ్ముచున్నాము."

ఈ ప్రకారముగా బహుమాసములనుండి రాజుచున్న వివాదాగ్ని పూర్ణముగా చల్లాఱి పోయినందున లక్ష్మీనరసింహముగారిఁక నిర్భయముగా తమ మనసు వచ్చినట్టు వ్యవహారము నడపవచ్చును. తమ తమ దౌర్జన్యములను వివేకవర్థనిలో వెల్లడించుచు వచ్చుటచేత నాకు శత్రువులయిన వారంద