పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

326

స్వీయ చరిత్రము.



యొక్క కార్యనిర్వాహక సంఘమువారి సభయందు చేయఁబడిన యీక్రింది నిర్ధారణముల కేమియు నాక్షేపణచెప్పక యామోదించి లక్ష్మీనరసింహముగారు వానిక్రింద తమ చేవ్రాలుచేసి సమాజమువారి యధికారము నొప్పుకొనిరి.

"2. That Mr. Pida Ramakrishnayya's allowance of Rs. 2 a month to Prabhala Mahalakshmi be continued to her out of his funds by Mr. A. L. Narasimham. (ప్రభల మహాలక్ష్మికి నెల 2 రూపాయలచొప్పున పైడా రామకృష్ణయ్యగారిచ్చుచుండిన జీతమాయన నిధిలోనుండి యామెకు ఏ. ఎల్. నరసింహముగారిచే నియ్యఁబడుచుండవలెను.)

3. That an additional allowance of Rs. 4 a month as well as Medical charges be paid to Saladi Ramayya for August and September out of Pida Ramahrishnayya's funds. (నెలకు 4 రూపాయలచొప్పున నెక్కువజీతమును వైద్యపు కర్చులను పైడా రామకృష్ణయ్యగారి నిధిలోనుండి శ్రావణ భాద్రపదమాసములకు సలాది రామయ్యకియ్యఁ బడవలెను.)

5. That a grant of Rs. 15 be paid to S. Ramiah in lieu of certain jewels (girdle and vessel) due to him and other matter out of Pida Ramakrishnayya's funds. (అతనికియ్యవలసిన కొన్ని నగలకు (ఒడ్డాణముపాత్ర)ను ఇతర వస్తువులకును బదులుగా పైడా రామకృష్ణయ్యగారి నిధిలోనుండి రు. 15ల సహాయధనము సలాది రామయ్యకియ్యబడవలెను

6. That a grant not excceding Rs. 200 be made to S. Ramiah for building a tiled house at Cocanada on the site given by Pida Ramakrishnayya out of his funds. (పైడా రామకృష్ణయ్యగారిచే కాకినాడలో నియ్యబడిన స్థలమునందు పెంకుటిల్లు కట్టించుకొనుట కాయననిధిలోనుండి సలాది రామయ్యకు రు. 200 లకు మించకుండ సహాయద్రవ్య మియ్యఁబడవలెను.)"