పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

314

స్వీయ చరిత్రము.

దంభా―మాధాన్యములో మీరు కోరినరెండు గరిశలూ కొన్నధరకు నేను యిప్పిస్తాను లెండి. మాస్వంతవాడుకకు అన్ని ధాన్యం అక్కరలేదు. ఈస్వామి శాస్తుర్లుగారు మనకన్ని వస్తువులూ యీప్రకారం చవకగా యిప్పిస్తారు. మనండబ్బుయిచ్చి కొంటాముగాని లంచాలు పుచ్చుకోము.

*****

దంభా―యేమీపనిలేదండి మేమిప్పుడు వేదాలనుగురించి మాట్లాడుతూవున్నాము. మన వేదాలు దైవదత్తాలను దానికి సందేహములేదు. ఆదరించే ప్రభువులులేకను కిరస్తానీ విద్యచేతనూ వేదశాస్త్రాలు నశిస్తూవున్నవి. భీమరాజు గారూ ! మనంవేదం వ్యాపించే ప్రయత్నం చేయవలెనండీ. మనవేదాలలో చెప్పిన వర్ణాశ్రమాచారాలు యేలాగునయినా నిలువపెట్టవలెను.

భీమ―చిత్తము అలాగేచేతాము. నావంతు చందా నేను యాభయి రూపాయలు యిస్తాను. అధికారులు మీరు తలపెడితే నాలుగు ఘడియలలో వెయ్యి రూపాయలు పోగవుతవి.

*****

దంభా―(లేచి) రాఘవాచార్యులుగారూ ! దయచెయ్యండి. ఆడి యేందాసుణ్ని.―అయ్యా ! మేము కొంచెము రహస్యము మాటడుకోవలెను. లోపలికి వెళుదుమా?―ఆచార్యులుగారూ ! లోపలికి దయచేస్తారా?

రాఘ―అక్కరలేదండి. తమరుచెప్పిన కార్యం మీరన్న ప్రకారం జాగ్రతపెట్టించినాను. ఈకాలములో పరమభాగవతాగ్రేసరులు అధికారంలో వున్నవారిలో మీరొక్కరు కనపడుతూ వున్నారు. మీ ద్వాదశోర్ధ్వ పుండ్రాలు చూచినా తులసితావళాలు చూచినా నాకు బహు సంతోషమవుతున్నది. మీరు తిరుమణి మహత్యము విన్నారు కాదండీ ?

*****

దంభా―అవచ్చే ఆయన రివరెండుకారు దొరగారు. స్వాములవద్ద నేను యేలాగు ప్రవర్తిస్తానో తమరే చిత్తగిస్తారు―హూణుడు వస్తూవు