పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

287



లో చేరినవారు చెప్పినమాటవిననివారయినను కష్టపడుచున్న యెడల సాయము చేయు చుండ వలెనని చెప్పెను. కాయకష్టపడఁగల దృఢశరీరు లుద్యోగము చెప్పినను చేయక సోమరితనమున కాలము గడప నిశ్చయించుకొన్నప్పు డట్టివారికి ధనదానముచేత సంతుష్టి కలిగింపఁ జూచుట నానియమములకు విరోధమయినందున మీరుచెప్పినను మీధనములోనుండియైనను నేనియ్యనని మో మోటములేక ఖండితముగాఁ జెప్పితిని. ఈవిషయమున 1883 వ సంవత్సరము సెప్టెంబరు నెల 9 వ తేదిని ఆయన నాకిట్లు వ్రాసిరి. -

(ఆముంజులూరి చిన్నవాఁడు మీరు కోరినట్టు యుక్తముగా నడుచుకోక పోయినయెడల, నెమ్మదిగా మీరతఁడు దానిని చేయునట్టు చేయవలెను. అతఁడు విధేయుఁడయి మిమ్ము ప్రీతునిఁజేయవలయును. అప్పుడు మీ శక్తిలో నున్నదంతయు నతనికి మీరే చేయుదురనుటకంటె ఎక్కువగా నేదియు నేను వాగ్దానము చేయలేదు. వారుమిమ్మెట్లు బాధించుచుందురో నేనెఱుఁగుదును. వారికి మీరు మీచేతనైనంతచేయుదురనియు మీస్థితిని పిత్రుచితమైన దానినిగాచేసికొంటిరనియు నేనెఱుఁగుదును. నేను సంబంధము కలిగించుకోను). [1]

ఇట్లు వ్రాసినను రామకృష్ణయ్యగా రతనికి రహస్యముగా సొమ్మిచ్చు చుండిరి. వారు వ్రాసినట్ల నేకులప్పుడప్పుడు సొమ్మునుగూర్చి నాకు తొందరకలుగఁజేయు చుండుట వాస్తవమే. అడిగినదెల్ల నిచ్చుటకు నేను రామకృష్ణయ్యగారివలె ధనికుఁడనుగాను; ఒకవేళ నేనియ్యఁగలిగినను వారికోరిక యనుచితమని నేననుకొన్నప్పు డిచ్చెడువాఁడునుగాను. నాదగ్గఱ నొక్కగొప్ప లోపముగూడఁగలదు. ఇతరులడుగునది న్యాయమైనదికాదని నేను భావించి

  1. "If that Moonjoolury boy does not act decently as you wish, you must make him do it quietly. I did not promise any thing more than he should obey and please you and then you will do for him your best. I know how they will be bothering you. I know you will do your best for them and you have made your position a parental one. I shall not interfere"