పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

285



గారు చెప్పినదివిని, తనయింటిని మరమ్మతు చేయుటకు వీరేశలింగముగా రశ్రద్ధ చూపినట్టాయన ఋజువు చేయలేదని నిర్ధారణ చేయఁబడుచున్నది.)

P. Srinivasa Rao, (పి. శ్రీనివాసరావు) Chairman.

K. Viresalingam, (కె. వీరేశలింగము)

N. Kothandaramiah, (ఎన్. కోదండరామయ్య)

B. V. Jogayya (బీ. వీ. జోగయ్య)

B. Gavarraju, (బీ. గవర్రాజు)


చేసిన నిర్ధారణముల క్రింద నప్పుడున్న కార్యనిర్వాహక సంఘమువారందఱును వ్రాళ్లుచేయుచుండుట యాచారమగుటనుబట్టి యీ నిర్ధారణములో కోదండరామయ్యగారు సహితము వ్రాలుచేసిరి. ఈగృహవిషయమైన కోదండరామయ్యగారి చర్య ముందు కొంతచూపఁబడును. ఆరెండుసంవత్సరములలోను గోదావరి ప్రవాహము వెనుకనున్న కోదండరామయ్యగారి యింటిలోనికి వచ్చినట్లే ముందువైపుననున్న చేబోలు వెంకయ్యగారియింటిలోపలికిని వచ్చెను. వెంకయ్య యుక్తసమయములో తగిన బాగుచేసికొనుచు వచ్చినందున నాతనియింటికంత యపాయము కలుగలేదు. ఇన్నీసుపేటలో నేనుకొన్న స్థలమునం దిల్లుకట్టఁబడిన తరువాత తణుకు చెలపతిరావుగారి కుటుంబము నచ్చటికి పంపివేసి, యానడిమియింటిలో పదుమూఁడవ వివాహము చేసికొన్న పటా నేని వెంకయ్యగారి కుటుంబము నుంచితిమి. రామకృష్ణయ్యగా రొకసారి రాజమహేంద్రవరమునకు వచ్చినప్పుడు కోదండరామయ్యగారు తనకా యిల్లుచాలదని యాయనతో మొఱ్ఱపెట్టుకోఁగా రామకృష్ణయ్యగారును నేనును గలిసిపోయి చూచినప్పు డాయిల్లిద్దఱికే యిచ్చిన పక్షమున విశాలముగా నుండునని యాయన నాతోఁ జెప్పిరి. మంగళవారపు పేటలో కొన్న స్థలములో నిల్లుకట్టిన తరువాత పటా నేని వెంకయ్యగారి నచ్చటికిపంపివేసి యా యిల్లిద్దఱికే యిచ్చెదనని నేను చెప్పితిని.