పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

స్వీయ చరిత్రము.

రఘునాధరావుగారును చెంచలరావుగారును పెండ్లిలోభోజనములు చేయకపోయినను కులమువారయిన మాధ్వులు చెన్న పురిలోని యెనిమిదవ వివాహానంతరమున వారిని కొంతబాధింప నారంభించిరి. వారి యాచార్యుఁడైన యుత్తరాది మఠస్వామి చెన్న పురికివచ్చి కొంతకాలమచ్చట వాస మేర్పఱుచుకొనిరి. వృద్ధురాలైన తల్లియొక్క దీనాలాపములుచేతను...........రావుగారి ప్రోత్సాహముచేతను తామొక దుర్బల నిమిషములో ప్రాయశ్చిత్తమునకు లోను గావలసివచ్చినదనియు, తాము యథాపూర్వముగానే వితంతూద్వాహ పక్షమునకు సాయము చేయుచుండెదమనియు, నా పేర చెంచలరావుపంతులుగారు తమ నిర్వేదమును దెలుపుచు లేఖవ్రాసిరి. ఈవిషయమయి నేను రఘునాథరావుగారిపేర వ్రాసితినిగాని వారు ప్రత్యుత్తరమియ్య ననుగ్రహించిన వారు కారు. ఆసంవత్సరాంతమున శీతకాలపు సెలవులలో నేనీపనిమీఁద మరల చెన్న పట్టణమునకుపోయి రఘునాథరావుగారి దర్శనముచేసితిని. వారు నన్ను చూచి "నేను ప్రాయశ్చిత్తముచేసికొంటినని మీకువ్రాసిన బుద్ధిహీనుఁడెవ్వఁడు?" అనిపలికి, వీరావేశముకలిగినట్లు దేహము పెంచి తలయాడించి సోత్సాహమైన గంభీరోచ్చైస్వనముతో "మాస్వామి యిప్పుడిక్కడనే యున్నాఁడు. ఈసమయమునందొక్క పెండ్లివారుకుదిరిరా, వాని యింటియెదుటనే పెండ్లిచేసి వానికి బుద్ధివచ్చునట్లు చేసియుందును" అనిపండ్లుగీటుచు పిడుగులు పడుచునట్లు వీరాలాపములు పలికిరి. శూరత్వము మూర్తీభవించినట్లున్న వారి యాకారమునుజూచి వారి వాక్సారము వినునప్పుడు నాహృదయములో నొకవిధమైన వికారము పొడమి మేను గగురుపొడువ వీరికున్న యుత్సాహములో నాకు నాలవవంతుండినపక్షమున నే నెంతో పనిచేసి యుండవచ్చునుగదా యని నాలో నాకే లజ్జవొడమఁ దొడఁగెను. ఈసంభాషణము ముగిసిన తరువాతనే నాయనను వీడ్కొని నాలోనే నీవిషయమునే యాలోచించికొనుచు చెంచలరావు పంతులుగారి యింటికివెళ్లి వారిదర్శనముచేసి రఘునాథరావుగారి యింటనడచిన సంభాషణమును విన్న వించితిని. ఆయన యనాదరము సూచించు ముఖ