పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

247



బడెడు పక్షమున, వివాహము చేసికొన్నవారికి ఘనమైన ధనసాహాయ్యముతో తోడుపడెడు స్థితియందు మూరున్నారా ? ఉన్న పక్షమున నెంతవఱకు ? పయి ప్రశ్న కుత్తరమును నాకు తెలిపినయెడల, ఈప్రశ్నను నేను మిమ్మేల యడుగ వలసెనో యందును గూర్చిన యధికవివరములను మీకుఁ దెలిపెదను. నేనీ మండలములోని మండలన్యాయసభ న్యాయవాదిని.

నాపేరు

చెరువు - సుబ్రహ్మణ్యశాస్త్రి,

డిస్ట్రిక్టుకోర్టు వకీలు, మచిలీపట్టణము.

నాయొద్దనుండి ముందుగా నంగీకారమును బడయువఱకును దయచేసి మీరీలేఖలోని సంగతుల నెవ్వరికిని దెలుపకుఁడు. మీరు నాస్థితి నెఱుఁగ కోరెడు పక్షమున రాజమండ్రీ డిస్ట్రిక్టుమునసబును అక్కడ వకీలుగానున్న శిష్టు జగన్నాధశాస్త్రిగారిని అంతకంటె నధికముగాక నేనెవరో తెలిసికొనుటకు మాత్ర మడుగవచ్చును. ఈయుత్తరములోని సంగతు లితరులకు తెలియఁజేయకుండ నాపరిచితుఁడని మీరు తలఁచిన యేమనుష్యునివలన నైనను నన్ను గూర్చి యేవృత్తాంతమునైనను మీరు పోగుచేయుటకు నాకాక్షేపము లేదు. ఇప్పుడు పడవల సంచారముండి యుండినపక్షమున, స్వయముగా మాటాడుటకు నేను మీవద్దకు వచ్చి యుందును. అది లేకపోయినందున, నేను మీతో లేఖాముఖమున నుత్తరములు జరుపవలసినవాఁడనయినాను." [1]

  1. My Dear, Sir, Masula, 16th April 1884.


    I take the liberty of addressing you by the epithet "Dear", tho' this is the first time that I took my pen to write you on any subject, on the simple ground that I sympathise with you for the step you took for relieving our help. less widows

    You will excuse me, I hope, for my not expressing my sympathy earlier. If any widow marriage were to be performed in the town, are you in a position to help the party with any substantial pecuniary aid. If so, to what extent? If you let me know the answer to the above question I shall let you know further particulars why I came now to ask of you this question. I am a District Court Vakil of this District.

    My Name, Charuvu subrahmayya Sastri,

    District Court Vakil, Masulipatam.


    Please don't disclose the contents of the letter to any body there before you take my previous permission. If you wish to know my status you may ask the District Moonsiff of Rajahmundry and Sistu Jagannadha Sastri Garu, a Vakil there, simply to know who am I and no further. Without letting others know of the contents of this letter, I have no objection for your collecting any information regarding me from any person whom you think that he is my acquaintance.


    Had there been canal communication, I would have gone up to you to speak in person. As that is now wanting I am obliged to keep letter correspondence with you."