పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

స్వీయ చరిత్రము.



హము జరపుట అవివేకమయినట్టు మాకు కనఁబడుచున్నది. అయినప్పటికిని కొంచెముమంది వచ్చుటతో పనిలేదని మీరు తలఁచెడు పక్షమున, మీరు రావచ్చును. మేమిల్లుసులభముగా కుదుర్పఁగలము." [1]

ఈ యుత్తరమురాఁగానే నేనీ వివాహములను చెన్న పట్టణములోనే చేయ నిశ్చయించుకొనియున్నాను గనుక వెంటనే యిల్లు కుదుర్పవలసినదని ప్రత్యుత్తరమువ్రాసి, జూన్ నెల 2 వ తేదిని "పదుముగ్గురము నేటి ధూమ నౌకలో బైలుదేఱుచున్నాము. ఇల్లుకుదుర్పుఁడు" అని తంత్రీవార్తనంపి, మేము పదుముగ్గురమును నాటిసాయంకాలమున పోయెడి పొగయోడలోనే చెన్న పట్టణమునకు బైలుదేఱితిమి. దారిలో గాలివానవచ్చుటవలనను, ప్రతికూల వాయువులవలనను, 4 వ తేది ప్రాతఃకాలమున నాఱేడు గంటలకు చెన్నపురి రేవు చేరవలసిన ధూమనౌక మధ్యాహ్నము రెండు గంటలకు చేరెను. మా

  1. "Mylapore, 28th May 1883.


    My dear sir,

    On the receipt of your letters, we convened an extraordinary meeting of the members of the Association. 30 members attended of whom 18 were brahmins. They are all willing to attend the marriage and take betel-nut. As regards dining, of course, Sudra members have no objection Which is not of much use to us. Of the Brahmin members very few are willing to dine but on conditions which it is not easy to secure. Under these circumstances, it seems to us that it would be unwise to celebrate the marriage at Madras. If you however think that the scanty attendance is of no consequence, you are welcome and we can easily arrange for a house.

    Yours truly

    R. RAGOONATH ROW"