పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

227

ఈవివాహమయినతరువాత అక్టోబరు 24 వ తేదిని కలకత్తానుండి యీశ్వరచంద్రవిద్యాసాగరులవా రిట్లువ్రాసిరి.

"దేశముయొక్క మీభాగములో మూడవ బ్రాహ్మణ వితంతువు యొక్క వివాహనిర్వహణమును గూర్చిన సమాచారమునకై నేను మీకెంతయు నుపకార స్మృతి కలవాఁడనై యున్నాను. ఇక్కడి వితంతు వివాహ విహితులు ఈశుభవర్తమానమువలన మిక్కిలి సంతోషమును పొందియున్నారు. అదృష్టహీనలైన దుఃఖభాగినుల పక్షమున మీయొక్క పరోపకార ప్రయత్నములకు నిరంతరవిజయము కలుగునుగాక యనుట

మీసుహృదుఁడైన యీశ్వరచంద్రశర్మయొక్క సమాహిత ప్రార్థన." [1]

కలకత్తానుండి యీశ్వర చంద్ర విద్యాసాగరులవారును, బొంబాయినుండి మహాదేవగోవిందరానెడిగారును, నాతోడనప్పుడప్పుడుత్త్రరప్రత్యుత్తరములను జరపుచు శాస్త్రవిచార విషయమున నాసందేహములను దీర్చుచు నాకెంతో సాయముచేయుచుండెడివారు.

ఈవఱకు జరగిన వివాహములు మూఁడును లౌక్యులుగానుండు నియోగి బ్రాహ్మణులలోను మాధ్వబ్రాహ్మణులలోను జరగినవి. వైదికులలో మాత్ర మింతవఱకు జరగనందున వారది గొప్పప్రతిష్ఠగాఁ జెప్పుకొనుచు తమవారిలో

  1. "Calcutta, 24th October, 82.


    My dear sir, I am very much obliged to you for the information respecting the celebration of marriage of the third Brahmana Widow in your part of the country. The friends of the marriage of Hindu Widows here have been exceedingly delighted by this happy news.


    May uniform success attend your benevolent exertions on behalf of the unhappy sufferers is the earnest prayer of

    Yours sincerely,

    ISWARA CHANDRA SARMA.

    K. VIRESALINGAM ESQ.,

    Rajahmandry.