పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

211

సరిగా కార్యముకావలసి వచ్చునప్పటికి బంధువులకు తెలియుటచేత వేంకటపతిరావుగారును, యజ్ఞన్న గారును, కూడభయపడి యిద్దఱును వెనుక తీసిరి. వేంకటపతిరావుగారి కూఁతురును, యజ్ఞన్న గారి చెల్లెలును, ఇద్దఱును చదువుకొన్న వారయి నాకావఱకే యుత్తరములు వ్రాసియుండిరి. అందుచేత సంరక్షకులను విడిచిపెట్టి యిఁకస్వయముగా నాబాలవితంతువులతోనే యుత్తర ప్రత్యుత్తరములను జరపి కార్యమును సాధింపవలెనని నేను నిశ్చయించు కొంటిని. ఇద్దఱిలో నొకచిన్నది పెద్దాపురములోనున్నది; ఇంకొకచిన్నది కాకినాడలోనున్నది. నేను వారిపేరనే యుత్తరములు వ్రాసెడుపక్షమున, రహస్యము వెల్లడియయి కార్యభంగము కాకమానదు. వితంతువివాహ సంస్కారవ్యాపనమునం దవ్యాజాదరము గలవా రయి నిపుణులై కార్యదక్షులయిన యిద్దఱుమిత్రులీవిషయమున గూఢముగా పనిచేయుటకయి పెద్దాపురమునందొకరును కాకినాడయందొకరును గావలసియుండిరి. ఆకాలమునందు రాజమహేంద్రవరనివాసులయి కార్యదక్షులయి వితంతువివాహ పక్షావలంబులయి మాకత్యంతాప్తులయిన గుమ్మడిదల మనోహరము పంతులుగారు పెద్దాపురమునందు పోలీసు ఇన్‌స్పెక్టరుగా నుండిరి; మాపక్షమున శ్రద్ధాళువులయి పనిచేయుచుండిన పెండెకట్ల లచ్చిరాజుగారు కాకినాడ జగన్నాధపురములో నుండిరిగాని పనిచేయవలసిన స్థలమునకు వారియిల్లెంతో దూరమున నుండెను. అయినను ఈయుభయమిత్రులవలనను కార్యముసాధింపవలెనని నేను నిశ్చయించుకొంటిని. ఇంతలో మాపక్షమునం దభిమానముగలవాఁడయి మేము కృషిచేయవలసిన చిన్న దాని యింటియెదుటనే కాపురముండిన తంజావూరి వేంకటచలపతిరావుగారు లభింపఁగా కాకినాడలో ఆయనవలన కార్యసాఫల్యమును బడయుట కేర్పఱుచుకొంటిని. స్టేట్యూటరీ సివిల్ సర్విస్ సంబంధమున గవర్రాజుగారుచెన్న పురికి పోవలసిన యావశ్యకము తటస్థింపఁగా, ఈ విషయమయి కాకినాడలో పనిచేయుటకును, కొట్టుపడిపోయిన లక్ష్మీనరసింహముగారి యభియోగ సంబంధమైన యుపర్యభియోగ విషయమయి చెన్న