పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

స్వీయ చరిత్రము.

ఇందు పేర్కనఁబడిన దండవిధాయకులైన జాన్‌సన్ దొరగారే రెండుమాసముల తరువాత జరగిన వితంతు వివాహసమయమున తాము స్వయముగావచ్చి యూరేగింపువేడుకను నడపి నాకెంతో సాయముచేసిరి ; డాక్టర్ స్మిత్తు దొరగారిప్పటికిని నాకు మిత్రులయి రాజమహేంద్రవరమువచ్చి నప్పుడెల్లను నన్ను చూచి పోవకమానరు.

2. "కాకినాడ. 26 - 3 - 84

"మీక్షేమమును గోరెడు మిత్రుఁడనుగాను, మీరు అశరణ్యలైబాధింపఁబడు జాతికి గొప్పయనుగ్రహమును జేయుచున్న గొప్ప సంస్కర్తలయి నందునను కెల్సాల్ గారి విషయమైన మీవ్యాఖ్యానములు రుచ్యమైనవికావని మీకు వ్రాసి తెలుపఁగోరుచున్నాను. మీకు రహస్యమైనట్టికాని బహిరంగమైనట్టి కాని శత్రువు కావచ్చునని నేను భయపడుచున్నాను.............. మీరు ప్రజలకు మిక్కిలి విలువ గలవారు. కాఁబట్టి యిటువంటి గొప్పవారును బలవంతులునైన వారినిగూర్చి వ్రాయకుఁడు. మేము మిమ్ము పోఁగొట్టుకొన్న పక్షమున, మేము సమస్తమును పోఁగొట్టుకొందుము. నన్ను క్షమింపుఁడు." [1]

మండల న్యాయాధిపతియైన యీకెల్సాల్ దొరగారు నాకు పరమమిత్రులయి రాజమహేంద్రవరములోనున్నప్పుడు మాయింటికి వచ్చుచుండుటయేకాక యుపకారవేతనమునుబడసి యింగ్లండునకుఁబోయిన తరువాత సహిత మప్పుడప్పుడిప్పటికిని నాపేరలేఖలు వ్రాయుచున్నారు.

  1. "As a friend interested in you and as you are a great reformer confering a great boon to the defencelessly afflicted sex, I wish to write and tell you that your remarks about Mr. Kelsal & c.........are not palatable. I fear, you may find a secret or public enemy..........you are to the public a very valuable one. So don't write about great and powerful men like this. If we lose you, we lose everything. Excuse me."