పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

193



రు. 1250 లను వారికిచ్చి ముద్రాయంత్రమును నేనే కొని పని నెప్పటివలె సాగింపంసాగితిని. నేను వితంతువివాహోద్యమములో మునిఁగియున్నప్పుడు సహితము మిత్రసాహాయ్యమున నిర్భయముగా నితరుల దౌష్ట్యములను వెల్లడించి ధర్మస్థాపనముచేయఁ బాటుపడుచునేయుంటిని. ఈవిషయమున శ్రీ పైడా రామకృష్ణయ్యగారి లేఖలలోని కొన్ని వాక్యము లిందుదాహరించెదను.

1. "కాకినాడ. 1 - 10 - 81.

గొప్పవారికి విరోధముగ మీరువ్రాసిన వ్యాసములలో కొన్నిటిని చదివినప్పు డెల్లను నేనత్యంతకంపమును బొందుచున్నాను. ఈయంశములలో దేనిలోనైనను మీరు చిక్కులలో పడుదురేమోయని భయపడుచున్నాను. మీకనేక శత్రువులున్నారు............ మీకడపటిదానిలో జాన్‌సన్ గారి విషయమునను పురపారిశుద్ధ్యసంఘము విషయమునను స్మిత్తుగారి విషయమునను మీవ్యాఖ్యానములను విచారముతో చదివినాను. ఎవరైనను మేము లక్ష్యము చేయమని మీరంటిరి. ఇది జాన్‌సన్‌గారి నుద్దేశింపఁబడినది. దండవిధాయులతోను దండశాఖాధికారులతోను తగవు పెట్టుకొనవలదని నేను మీకు హితముచెప్పుచున్నాను............... దీని యంతవలనను నేను చెప్పఁదలఁచుకొన్న దేమనఁగా - ఏదినముననైన మీరు శ్రమలోనికి వచ్చెడు పక్షమున, వితంతుపక్షములో నొక గొప్ప పోషకుని నేను పోఁగొట్టుకొనవలసివచ్చును. ఆవేఁడి మీతో పడిపోవును."[1]

  1. " I get very nervous whenever I read some of the articles of your paper when you attack big men. I fear in any one of the occasions you will get into trouble. You have many cnemies............... In your last. I read with sorrow your remarks about Mr. Johnson, the municipality and Mr. Schmidt. You said in it 'we do not care whoever it may be.' It is meant for Mr. Johnson. I do not advise you to get into row with Magitrates anad criminal Judges, ............ By all this I mean to say that one day if you get into trouble, I should lose a great patron in widows' cause. The warmth will fall with you."