పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

175



దంపతుల నాశీర్వదించుచు మమ్మభినందించుచు మఱునాటినుండియు నానా ముఖముల తంత్రీవార్తలును లేఖలును రాఁదొడఁగినవి. చెన్న పురినుండివచ్చిన రెండు లేఖలలోని భాగములను మాత్రమీ సందర్భమున నిందుఁ బొందుపఱుచు చున్నాను : -


"తిరువల్లికేణి - 13 వ డిసెంబరు 1881.


[1]మీ తంతిసమాచారము మమ్మందఱిని అత్యంత సంతోషవంతులనుగాఁ జేసినది. మిమ్మును దంపతులను ఈశ్వరుఁడాశీర్వదించునుగాక ! మీయొక్క యవ్యాజమైనట్టియు నుత్సాహవంతమయినట్టియు ప్రయత్నములను సఫలము చేయుట కిప్పటికాయనకు దయవచ్చినది. రాజమహేంద్రవర మిప్పటినుండి జీవవంతమయిన దయినట్టు చెప్పఁబడవచ్చును. మనరాజధానియొక్క చరిత్రములో డిసెంబరు 11 వ తేదిని మిక్కిలి ప్రసిద్ధదినమునుగా మీరు చేసి యు

  1. "Your telegram has made us all exceedingly happy. May God bless you and the couple ǃ It has at last pleased Him to crown your earnest and ardent exertions with success. Rajahmundry may henceforth be said to live. You have made the 11th of December a very remarkable day in the history of our Presidency. I feel very sorry for not being on the spot to share with you the joy as well as the trouble you must necessarily have undergone.


    Are we to have any more marriages soon? Unless some more are done in the heat there will not be much good forth-coming from one marriage. If you follow up this success and perform four or five more soon, Madras, as some wish me to believe, will follow in the wake of Rajahmundry. I have heard that Avadhani has heard from his brother to say that there are to come off four more marriages this week. I offer my heartfelt prayers to God to make you to telegraph to me this news soon"