పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

స్వీయ చరిత్రము.

మ్మని కొడుకును బతిమాలఁ దొడఁగెను. ప్రార్థనాసమయమునందు వందలకొలఁది జనులువచ్చి ప్రతివారమును ప్రార్థనలు విని యానందించి పోవుచుండెడి వారు. కొందఱు కోమటులు సహితము తమయంగళ్ళను కట్టిపెట్టి వచ్చి యాసక్తితో ప్రార్థనలను వినుచుండెడివారు. ఈసమాజమువలననే పూర్వా చారపరాయణులకు సహితము గుడ్డివాండ్రు కుంటివాండ్రు మొదలైన వికలాంగులకుఁ జేసినదే యుత్తమదాన మనుజ్ఞానము కలిగినది. ఈసమాజ మూలముననే బీదలకు రాత్రిపాఠశాలలు మొదలైనవి మొదట స్థాపింపఁబడినవి.