పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

115

ప్రవాదము పుట్టినది. నాఁడు విచారణదిన మగుటచేత సాక్షులును పౌరులును పగలు పదిగంటలు కాకమునుపే సభా భవనమునకుఁ బోయి యుండిరి. సాక్షి నయి యుండుటచేత నేనును మిత్రులతోడ సభామందిరమునకు ముందుగానే పోయియుంటిని. అప్పటికి సభాభవనములో నొక వింత నడుచుచున్నది. ఆవఱకే సిరస్తాదారుగారును క్రిమినల్ రికార్డుకీపరుగారును వచ్చి యొకగదిలో తలుపులు వేసికొని కూర్చుండి రహస్యముగా నేదో పనిచేయుచుండిరి. నేనును నామిత్రులును తాళముచెవిపెట్టుతలుపుసందులోనుండి యొకరొకరుగా లో పలఁ జూచితిమి. సిరస్తాదారుగారును బొల్లాప్రగడ వెంకన్న గారును ఒక చోటఁగూరుచుండి కాగితపుముక్కల నొకకాగితపుసంచిలో వేయుచుండిరి. వారిపార్శ్వమున దీపము వెలుఁగుచుండెను. ముద్రవేయుటకుఁ గాఁబోలును లక్కకణిక వెంకన్న గారిచేతిలో నుండెను. ఇంతలో న్యాయాధిపతిగారును సభకు విజయంచేసిరి. ఆయన స్వపీఠము నధిష్ఠింపఁగానే మిర్తిపాటి రామయ్య గారు వచ్చి తనచేత నర్పింపఁబడిన ముక్కలు మార్పఁబడుచున్న వనియు, వెంటనే తనముక్కలను దనకుఁ జూపవలసినదనియు, న్యాయాధిపతిగారి ముందఱ మొఱ్ఱపెట్టుకొనెను. కొంచెముసేపటికి సిరస్తాదారు వచ్చి యతికించి యుండనిముక్కలను గొన్నిటినిదెచ్చి న్యాయాధిపతిగారి బల్లమీఁదఁబెట్టెను. శోధించి చూచి యవితాను కాగితపుసంచిలోఁ బెట్టియిచ్చిన ముక్కలు కావనియు, సిరస్తాదారు ముక్కలను మార్చుచుండఁగా చూచినసాక్షులున్నా రనియు వెంటనే విమర్శ చేయవలసినదనియు, మిర్తిపాటి రామయ్యగారు బహువిధముల న్యాయాధిపతిగారిని బ్రార్థించెను. ముక్కలు పోయినందుకుఁ దాముచేయవలసినపని లేదని న్యాయాధిపతిగారు సెలవిచ్చిరి. అంతేకాక మామండలన్యాయాధిపతిగారు మిర్తిపాటిరామయ్యగారినిపిలిచి, నీ వపకారము నొందిన వాదిప్రతివాదులలోఁ జేరినవాఁడవు కావు గావున నీవిన్న పమును విమర్శింప వలనుపడదని చెప్పి పంపి వేసిరి. మండల న్యాయసభలోని న్యాయ విచారణ నాటి కీవిధముగా ముగిసినది. ఆవఱకు కామరాజుగారును తత్పక్షా