పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

స్వీయ చరిత్రము.

పోయి కొంతదూర మరిగినతరువాత దారిలో నొకయరుగుమీఁద నామెను గూర్చుండఁబెట్టి యామె నెందునకో నిర్బంధింపఁ జొచ్చిరఁట. అంతట నా చిన్న దానిభాగ్యముచేత నాత్రోవను బోవఁ దటస్థించిన యొక పెద్దమనుష్యు డామెయేడుపువిని చేరరాఁగా భటులు భయపడి పడుచును విడిఁచిపాఱి పోయిరఁట. తచ్ఛాఖవాఁడైన యాబ్రాహ్మణగృహస్థుఁ డాయువతివలన జరగిన వృత్తాంత మంతయు విని యామెను వెంటఁబెట్టుకొని యింటికిఁ గొనిపోయి కొమార్తెనిమిత్త మేడ్చుచున్న తల్లి కప్పగించి పోయెను. అట్లు విడిపించి యా తరుణిమానమును కాపాడినయా పెద్దమనుష్యుఁడు మఱునాఁడు ప్రాతఃకాలముననే నాయొద్దకువచ్చి గతరాత్రిజరగినయారక్షకభటులదౌర్జన్యమును నాతో జెప్పి పత్రికలోఁబ్రకటింపుమని కోరెను. నేనారెండుస్థలములకును బోయి విచారింపఁగా నేను విన్న దంతయు వాస్తవమయినట్టు స్పష్టపడెను. నే నాదుర్నయమునుగూర్చి వివేకవర్ధనిలో వ్రాసిప్రకటించితిని. ఆరక్షకమండలాధ్యక్షుడు పత్రికలో వ్రాయఁబడిన విషయమునుగూర్చి విచారణముచేయ నారంభింపగా, నేను విన్న కన్న సంగతులను సరిగాఁ జెప్పితిని; నాతోఁ జెప్పిన పెద్ద మనుష్యుఁడు తానావిషయమే యెఱుఁగననియు, నాతో నేమియు జెప్ప లేదనియు, సాక్ష్యమిచ్చెను; ఆచిన్న దానితల్లి తమయింట నేమియునల్లరిజరగ లేదనియు, తనకూఁతురారాత్రి తెల్లవాఱినదాఁక తనయొద్దనే పరుండియుండె ననియు, తెలియఁజేసెను; పరిభవపఱుఁబడినయాపడుచు తన్నె వ్వరునువీధిలోని కీడ్చుకొని పోలేదనియు, తానింటసుఖముగా నిద్రించు చుంటి ననియు చెప్పెను. అయిననుఁ, ఆరక్షకభటాధ్యక్షుఁడు నామాటయందు విశ్వాసము కలవాఁడయి, ఆభటులపేరులు తరువాత నావలనఁ దెలిసికొని వారి ననారోగ్యకరమైన మన్నెపుప్రదేశమునకుఁ బంపి శిక్షించెను. పిమ్మట మొదట నాతోఁ జెప్పినపెద్దమనుష్యుఁడు మరల నాయొద్దకువచ్చి, నిజము చెప్పినయెడల స్త్రీలు కార్యస్థానములవెంటఁ దిరుగవలసివచ్చునని తానట్లు కల్ల లాడవలసివచ్చె ననియు, స్త్రీలవిషయమున బొంకిన ననృతదోషము లేదనియు, చెప్పి క్షమా