పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

స్వీయ చరిత్రము.

నున్నవారి నందఱి నాహ్వానము చేయకుండెడివాఁడు కాఁడు. ఆసభల కెవ్వరైనను పోకయుండిరా, మఱునాఁడు వారియింటిముందఱ పెంటయున్నదనియో ముఱికినీరు వీధిలోనికి వచ్చినదనియో యామందభాగ్యు లేదో యభియోగము పైని సభలకీడ్వఁబడి కొన్నాళ్లు పనిచెడి తిరిగినమీఁదట వేశ్యల కియ్యవలసిన యొక్క రూపాయకు బదులుగా నాలుగురూపాయలు ధనదండన మిచ్చుకోవలసినవారగుచుండిరి. ఇటువంటి యధికారులు కొందఱు తమయింట వచ్చెడు వసూళ్లలో సగముమాత్రమే వేశ్యల కిచ్చుటకును తక్కిన సగమును తామే గైకొనుటకును వేశ్యలతో నేర్పాటుచేసికొని యీవిధముగా నెల కిన్నూఱో మున్నూఱో గడించుచుండిరి. పదిరూపాయలపనిలో నున్నవారు కొన్ని సమయములయందొక్క నెలలో నాలుగోయైదో రూపాయ లధికారులయిండ్లలో వేశ్యలనిమిత్తమ పాత్రనిర్బంధధానములుచేసి యా నెలలోభార్యాపుత్రాదులతో నింట నర్థభోజనముతోఁ దృప్తినొందవలసినవా రగుచుండిరి. ఈదుచారమును నివారించుటకయి సభలు చేయించి మావివేకవర్ధని యెంతో పనిచేసినది. ఆసభలలో కడపటిదానినిగూర్చి 1878 వ సంవత్సరము జనవరిపత్రికలోఁ బ్రకటింపఁ బడినపర్యవసానుము నిందుఁ బొందుపఱుప ననుజ్ఞ వేఁడుచున్నాను -

"కడపట నిఁక ముందు వివాహాదులయందుఁ దాంబూలములకు వచ్చువారు వసూళ్లు వేయుదురాచారమును మాన్పించుట ముఖ్యకార్యమని నిశ్చయింపఁ బడినది. అప్పు డాసభకు వచ్చిన పెద్దమనుష్యు లందఱును తా మిఁక ముం దెక్కడకు తాంబూలములకు వెళ్లినను వసూళ్లు వేయమనియు, తమ యిండ్లలో శుభకార్యములు జరగినయెడల నితరులు వసూళ్లు వేయకుండు ప్రయత్నముం జేయుదుమనియు, వాగ్దానము చేయుటయేకాక యీసమాజములోఁ జేరినవారెవ్వరును వసూళ్లు వేయఁగూడదనియు, ఎవ్వరైనను వేసిన యెడల వారిని తమయిండ్లకు తాంబూలములకుఁ బిలువఁగూడదనియు వారి యిండ్లకు తాము తాంబూలములకు వెళ్లఁగూడదనియు, ఎవ్వరైనను వెళ్లిన పక్షమునను పిలిచిన పక్షమునను ఆవెళ్లిన పిలిచినవారివిషయములోఁగూడ నా